Mlc Dande Vithal : ఎమ్మెల్సీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు, సుప్రీంలో సవాల్ చేస్తానంటోన్న దండే విఠల్
Mlc Dande Vithal : ఆదిలాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీగా దండే విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ వెళ్తానని విఠల్ తెలిపారు.
Mlc Dande Vithal : ఆదిలాబాద్ (Adilabad)స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక(Dande Vithal)పై హైకోర్టు (High Court)శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. రూ.50,000 జరిమానా కూడా విధించింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి గతంలో దండ విఠల్ ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు నామినేషన్ వేసినప్పటికీ తన ప్రమేయం లేకుండానే ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరించారని, ఎన్నికల అధికారులు సైతం తాను నామినేషన్ (Nomination)వేసినట్లు ప్రకటించారని, అప్పట్లో పత్తిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. వాదోపవాదాల అనంతరం న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సంచలనం రేగింది.
సుప్రీంకోర్టుకు వెళ్తా- ఎమ్మెల్సీ దండే విఠల్
స్థానిక సంస్థల ఎన్నికల్లో(Localbody Elections) తన ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకస్తూ సుప్రీంకోర్టు వెళ్తారని ఎమ్మెల్సీ దండే విఠల్ (Mlc Dande Vithal)తెలిపారు. హైకోర్టు తీర్పు(TS Hight Court)పై తనను విస్మయానికి గురి చేసిందన్నారు. కేసు నమోదు చేసిన వ్యక్తి నామినేషన్ ఉపసంహరణలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తీర్పుపై అప్పీల్ (Appeal)కు వెళ్లేందుకు హైకోర్టుకు తనకు నాలుగు వారాలు సమయం కేటాయించిందన్నారు. సుప్రీంకోర్టు(Supreme Court)లో తనకు సంపూర్ణ న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యాయస్థానంపై నమ్మకం
ప్రజాస్వామ్యంలో జరిగే అన్యాయాలపై వచ్చే కోర్టు తీర్పులు(Court Verdict) ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందిస్తాయని మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వరి రెడ్డి అన్నారు. తాను వేసిన కేసును క్షుణ్ణంగా పరిశీలించి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజల్లో, నాయకుల్లో నమ్మకం, విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు
రిపోర్టింగ్: వేణుగోపాల్ కామాజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి