Adilabad News : అడ్డువచ్చిన చెట్లు అడవిలోకి, ట్రాన్స్ లోకేషన్ తో 200 వృక్షాలు తరలింపు!-adilabad news in telugu forest department translocating 200 trees in forest ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Adilabad News In Telugu Forest Department Translocating 200 Trees In Forest

Adilabad News : అడ్డువచ్చిన చెట్లు అడవిలోకి, ట్రాన్స్ లోకేషన్ తో 200 వృక్షాలు తరలింపు!

HT Telugu Desk HT Telugu
Jan 02, 2024 10:11 PM IST

Adilabad News : రోడ్డు వెడల్పు పనుల్లో అడ్డువచ్చిన చెట్లను ట్రాన్స్ లోకేషన్ చేయాలని అటవీ శాఖ కాంట్రాక్టర్లకు సూచించింది. నిర్మల్ నుంచి జగిత్యాల వరకు నేషనల్ హైవే 61 జాతీయ రహదారి విస్తరణ పనుల్లో అడ్డువచ్చిన చెట్లను తరలిస్తున్నారు.

చెట్లు తరలింపు
చెట్లు తరలింపు

Adilabad News : వృక్షో రక్షతి రక్షితః అంటారు. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి. అందుకే భారీ వృక్షాల సంరక్షణ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ లో అటవీశాఖ సరికొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి జరగాలని రోడ్డు మార్గాలు ఏర్పడాలని పల్లెటూరులను బాహ్య ప్రపంచాలకు కలపాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న రోడ్డు వెడల్పు పనులకు చెట్లు అడ్డంగా ఉంటాయని చెట్లు నరకడం సరికాదని అటవీ శాఖ సదరు కాంట్రాక్టర్లకు నిబంధనలను సూచించింది. అడ్డు వచ్చిన చెట్టు కొట్టడానికి వీలు లేదని తెలిపింది. చెట్టు కొమ్మ గొడ్డలి వేటుకు పడరాదని నిబంధనలు విధించింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో చెట్లను కూకటి వేళ్లతో పెకిలించి తీసి మరొక చోటుకి తరలించి ట్రాన్స్ లోకేషన్ పద్ధతి ద్వారా నాటాలని పేర్కొంది, ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వల అభయారయంలో నిర్మల్ నుంచి జగిత్యాల వరకు నేషనల్ హైవే 61 జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రభుత్వం మొదలెట్టింది.

ట్రెండింగ్ వార్తలు

200 చెట్లు తరలింపు

నిర్మాణ పనుల్లో భాగంగా అడ్డుగా వచ్చిన చెట్లను ట్రాన్స్ లోకేషన్ ద్వారా వేరే చోట నాటాలని బాసర సర్కిల్ ఉన్నత అధికారి చీఫ్ కన్వర్టర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సి. శరవనన్ డీఎఫ్ఓలకు సూచించారు. ఈ సూచనల మేరకు అటవీ సిబ్బంది డిప్యూటీ రేంజ్ అధికారి నజీర్ ఖాన్ సిబ్బంది కలిసి రోడ్డు నిర్మాణ పనుల్లో అడ్డుగా వచ్చిన వృక్షాలను నరికి వేయకుండా భారీ వృక్షాలైన టేకు, ఇప్ప, చింత, చెన్నంగి, రావి, మద్ది, సోమి, రేలా, చందుగా, దుంపిడి, చట్టం.... తొలగించి ట్రాన్స్ లోకేషన్ చేస్తున్నారు. సుమారు 200 వృక్షాలను నిర్మల్ డివిజన్ పరిధిలోని మామడ రేంజిలో దిమ్మదుర్తి, మామడలోని కంపార్ట్మెంట్ నెంబర్ 940లో నాటుతున్నారు. చెట్టు సంరక్షణ అందరి బాధ్యత అని, ఆకుపచ్చ చెట్లు, మానవ మునుగడకు ఎంతో ప్రాతినిధ్యం ఉందని తెలిపారు.

ట్రాన్స్ లోకేషన్ అంటే ఎలా చేస్తారు:

ట్రాన్స్ లోకేషన్ అంటే వృక్షాలను ఒక చోట నుంచి మరొక చోటికి కూకటి వేళ్లతో తీసుకెళ్లి నాటుతారు. మహా వృక్షం చుట్టూ పనికిరాని కొమ్మలను, ఆకులను తీసివేస్తారు. అత్యధిక ప్రావీణ్యం గల వ్యక్తులు మహా రుక్షం చెట్టు గుంతను తవ్వి నాలుగు రోజులపాటు అందులో నీళ్లు నింపి తల్లి వేర్లు చెడిపోకుండా జాగ్రత్తగా తట్టు బొంతని చుట్టి కాపాడుతారు. అనంతరం వాతావరణం మబ్బులుగా ఉన్న సమయంలో, చల్లని వాతావరణంలో క్రెన్స్ సహాయంతో ట్రాన్స్పోర్ట్ చేసి అంతకుముందే తవ్విన గుంతలో నాటుతారు. మట్టిని కప్పి ఎరువులు వేసి నాటుకునే వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. జాతీయ రహదారి 61 నిర్మాణ పనుల్లో అడ్డువచ్చిన చెట్లను ట్రాన్స్ లోకేషన్ ద్వారా వేరే చోటికి ఇదేవిధంగా తరలిస్తామని అటవీ అధికారులు తెలిపారు. అటవీ అధికారులు వృక్షాల సంరక్షణకు చేపడుతున్న విధానం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వృక్షో రక్షతి రక్షిత అని వారి వంతు సహాయం చేయడానికి సిద్ధపడుతున్నారు.

రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా

IPL_Entry_Point