Chanaka korata Projects : కొన'సాగు'తున్న చనాక కొరాట, సదర్మాట్ ప్రాజెక్ట్ పనులు-adilabad chanaka korata sadarmat project works in progress latest updates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Chanaka Korata Projects : కొన'సాగు'తున్న చనాక కొరాట, సదర్మాట్ ప్రాజెక్ట్ పనులు

Chanaka korata Projects : కొన'సాగు'తున్న చనాక కొరాట, సదర్మాట్ ప్రాజెక్ట్ పనులు

HT Telugu Desk HT Telugu

Chanaka korata Sadarmat Projects : ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న పెన్ గంగా నదిపై చనాక-కొరాట బ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టింది. పదేండ్లుగా జరుగుతున్న పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిధుల కొరతే పనుల ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది.

కొన'సాగు'తున్న చనాక కొరాట, సదర్మాట్ ప్రాజెక్ట్ పనులు

Chanaka korata Sadarmat Projects : ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్న పెన్ గంగా నదిపై బ్యారేజీని నిర్మించాలనే ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో 2016వ సంవత్సరంలో రూ.386 కోట్ల అంచనా వ్యయంతో కొరాట- చనాక బ్యారేజి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పదేండ్లుగా పనులు నెమ్మదిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి అయితే అదిలాబాద్ ఇంకా బోథ్ నియోజక వర్గాల్లో సుమారు 50వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశలు అడిఆశలుగానే మిగిలిపోతున్నాయి. పదేండ్లు గడుస్తున్న పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అధికారులు మాత్రం బ్యారేజీకు సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు కాగానే పనులను తిరిగి చేపడతాం అని స్పష్టం చేస్తున్నారు.

చనాక బ్యారేజీ

చనాక బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి అయినప్పటికీ ఇంక సాగు నీటి కాలువల నిర్మాణం పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. హత్తి ఘాట్ పంప్ హౌస్ పనులను పూర్తి చేసి వెట్ రన్ నిర్వహించినా కూడా ఇప్పటి దాకా ఆయకట్టుకు చుక్క నీరుపారడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెడుతుందని భావించినప్పటికీ సంవత్సరం గడిచి పోయిందే తప్ప బ్యారేజీ కాలువల నిర్మాణపు పనులు ఎక్కడి కక్కడే నిలిచి పోతున్నాయి. ఈ పనులు పూర్తి కావాలంటే మరో రెండేండ్ల సమయం పట్టే విధంగా కనిపిస్తుంది. అది కూడా పూర్తి స్థాయిలో నిధులు మంజూరు అయితేనే. నిధులు లేవన్న కారణం తోనే పనులను చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే మాట వినిపిస్తోంది.

గడిచిన పదేండ్ల నుంచి పనులు నత్త నడకగా నడుస్తున్నాయే తప్ప వేగంగా ముందుకు సాగడం లేదు. ఇష్టారీతిన బ్యారేజి నిర్మాణ పనుల అంచనాల వ్యయం పెంచేయడం కారణంగా నిధులు విడుదల కాక పోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. నిర్మించిన పనుల వద్ద పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి పోయి కనిపిస్తున్నాయి. మరో వైపు అధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో పనుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే బ్యారేజీ నిర్మాణపు పనులు పెండింగ్ లోనే ఉండే అవకాశాలు లేక పోలేదు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణం పనుల వైపు దృష్టి సారించి మిగిలిపోయిన పనులను త్వరిత గతిన పూర్తి చేసి ఆయకట్టుకు సాగు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

సదర్మాట్ బ్యారేజీ పనులు అంతే సంగతులు

1892లో శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కంటే ముందు బ్రిటిష్ కాలంలో గోదావరి నడిపైన ఏర్పడిన సదర్మాట్.. ఆధునీకరణ పేరుతో చేపట్టినటువంటి పనులు సైతం కొనసాగుతున్నాయి. నిర్మల్గ జిల్లా మామడ మండలం పొనకల్త గ్రామ సమీపంలోని గోదారి నడిపైన సదర్మాట్ స్టోరేజీ పెంపుదల పనులు 10ఏళ్లుగా పనులు నడుస్తూనే వున్నాయి. ప్రతియేటా రెండు పంటలకు నిరంతరాయంగా సాగు నీరు అందించే టువంటి సదర్మాట్ వర్షాకాలం పంటలకే పరిమితం అయ్యింది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి రైతులను ఆడుకోవాలని కోరుతున్నారు.

రిపోర్టింగ్: కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.

HT Telugu Desk

సంబంధిత కథనం