Sonu Sood : కరీంనగర్ బాలుడికి సోనూ సూద్ సాయం-actor sonu sood helps 7 month old from karimnagar with liver transplant surgery ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Actor Sonu Sood Helps 7 Month Old From Karimnagar With Liver Transplant Surgery

Sonu Sood : కరీంనగర్ బాలుడికి సోనూ సూద్ సాయం

HT Telugu Desk HT Telugu
Jul 20, 2022 06:00 PM IST

నటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన బాలుడికి సాయం చేశాడు.

బాలుడికి సోనూ సూద్ సాయం
బాలుడికి సోనూ సూద్ సాయం

సినిమాల్లో విలన్ వేషాలు వేస్తూ.. నిజ జీవితంలో ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరోగా నిలుస్తున్నారు నటుడు సోనూసూద్. కొవిడ్ సమయంలో ఎందరికో అండగా నిలిచారు. లాక్‌డౌన్లో ఇబ్బందిపడిన లక్షలాది మందిని సొంత ఊళ్లకు చేర్చారు. సాయం అడిగితే.. కాదు.. లేదు అనకుండా చేశారు. ఇంకా తన సేవను కొనసాగిస్తూనే ఉన్నారు. చాలామందికి ఆపద్బాంధవుడిలా ఉన్నారు. ప్రాంతం, భాష దాటి సోనూ సూద్ సేవలు ఉన్నాయి. తాజాగా కరీంనగర్ బాలుడికి సాయం చేశాడు ఈ ఉత్తమ విలన్.

ట్రెండింగ్ వార్తలు

కరీంనగర్‌కు చెందిన ఏడు నెలల మహ్మద్ సఫాన్ అలీకి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడంలో సహాయం చేశాడు సోనూ సూద్. కేరళలోని కొచ్చిలోని ఆస్టర్ మెడ్‌సిటీ ఆసుపత్రిలో ఈ చికిత్స జరిగింది. సోనూ సూద్‌తో కలిసి ఆస్టర్ వాలంటీర్లు ప్రారంభించిన సెకండ్ ఛాన్స్ ఇనిషియేటివ్ కోసం.. చికిత్స తీసుకున్న మొదటివాడు సఫాన్ అలీ అనే బాలుడు.

సఫాన్ అలీకి నాలుగు నెలల వయస్సు ఉన్నప్పుడు కొచ్చిలోని ఆస్టర్‌కు తీసుకువచ్చారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే బిలియరీ అట్రేసియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధితో కాలేయంపై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతుంది. తెలంగాణలోని వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కానీ శస్త్రచికిత్స విఫలమైంది. ఆ తర్వాత బాలుడికి కామెర్లు, సిర్రోసిస్‌ ఉంది. దీనికి కాలేయ మార్పిడి అవసరం. సోనూ సూద్ సహాయంతో రోగి కొచ్చిలోని ఆస్టర్ మెడ్‌సిటీకిలో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేశారు.

'వైద్యంలో భారతదేశం భారీ ప్రగతిని సాధించింది. సఫాన్ అలీ, అతని కుటుంబ సభ్యులలాంటి వారికి వైద్యం ఇంకా చాలా దూరంలోనే ఉంది. చాలా ఎక్కువ ఖర్చు కారణంగా.. సెకండ్ ఛాన్స్ చొరవతో వైద్యం చేయించాం. సఫాన్ అలీ ఆరోగ్యంగా ఉండాలి.' అని నటుడు సోనూసూద్ అన్నారు.

IPL_Entry_Point