Siddipet Accident: సిద్దిపేట జిల్లాలో ఉపాధి హామీ పథకంలో అపశృతి..బండరాళ్లు దొర్లి తల్లి కూతుళ్లు మృతి,5 గురికి గాయాలు-accident in siddipet districts employment guarantee scheme mother and daughters killed 5 injured due to falling rock ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet Accident: సిద్దిపేట జిల్లాలో ఉపాధి హామీ పథకంలో అపశృతి..బండరాళ్లు దొర్లి తల్లి కూతుళ్లు మృతి,5 గురికి గాయాలు

Siddipet Accident: సిద్దిపేట జిల్లాలో ఉపాధి హామీ పథకంలో అపశృతి..బండరాళ్లు దొర్లి తల్లి కూతుళ్లు మృతి,5 గురికి గాయాలు

HT Telugu Desk HT Telugu
Jan 30, 2025 01:18 PM IST

Siddipet Accident: ఉపాధి హామీ పథకం పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట్ మండలంలో గోవెర్ధనగిరి గ్రామం శివారులో పనిచేస్తున్న, ఉపాధి హామీ కార్మికుల పైన బండరాళ్లు దొర్లి పడటంతో, తల్లి కూతుర్లు ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరొక ఐదుగురు కార్మికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

ఉపాధి హామీ పథకంలో అపశృతి, రాళ్లు పడి తల్లీకూతుళ్లు మృతి
ఉపాధి హామీ పథకంలో అపశృతి, రాళ్లు పడి తల్లీకూతుళ్లు మృతి

Siddipet Accident: సిద్దిపేట జిల్లా అక్కన్న పేట మండలంలో ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం జరిగి తల్లీ కూతుళ్లు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

yearly horoscope entry point

గ్రామస్తులు, అధికారుల కథనం ప్రకారం, గ్రామంలోని ఉపాధి హామీ కార్మికులు గత కొన్నిరోజులుగా ఊరి చివరలో ఉన్న గుట్ట వద్ద మట్టి ఎత్తే పనులు చేస్తున్నారు. యధావిధిగా, ఈ రోజు కూడా కూలీలు పనికి వెళ్లారు. గుట్ట మీద కొన్ని భారీ బండ రాళ్ళూ ఉండటం, కూలీలు చుట్టూ ఉన్న మట్టి తొలగించడంతో, ఆ బండరాళ్లు కింద పనిచేస్తున్న కూలీల పైనా దొర్లి పడ్డాయి.

మరొక ఇద్దరి పరిస్థితి విషమం....

గ్రామానికి చెందిన మహిళా కందారపు సరోజన (51), అదే గ్రామంలో నివసిస్తున్న తన కూతురు అన్నారి మమతా (32) అక్కడిక్కడే మృతి చెందారు. మరొక ఇద్దరు కూలీలకు రెండు కళ్ళు విరిగిపోయాయి. వెంటనే స్పందిచిన, మిగతా కూలీలు గ్రామస్థులకు తెలపటంతో, జేసీబీ ని తీసుకొచ్చి, బండరాళ్లను తొలగించి మృతదేహాలను తొలగించారు.

ప్రమాద స్థలంమంతా రక్తంతో తడిచిపోయింది. తమ బంధువులు, గ్రామస్తులకు ప్రమాదం జరగటంతో, గోవెర్ధనగిరి గ్రామస్తులు, పక్క గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారి ఏడుపులతో, హాహాకారాలతో, ప్రమాదస్థలం ప్రతి ధ్వనించింది. మరణించిన ఇద్దరి మహిళాల శవాలను హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టమార్టమ్ కోసం తరలించారు.

గాయపడిన వారికీ, ప్రధమ చికిత్స చేసిన తర్వాత, వారిని కూడా దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. గ్రామా ప్రజలు మాట్లాడుతూ, చనిపోయిన వారిలో ఒకరైన మమతా, తన ఇద్ద

రు పిల్లలను అప్పుడే పాఠశాలకు పంపించి, పనికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇద్దరు పిల్లలు కూడా తల్లి లేనివారయ్యారని, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

బాధితుల్ని ఆదుకుంటాం..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో గుంత తీసే క్రమంలో ఇద్దరి ఉపాధి హామీ కూలీలు మరణించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన కారణాల పై జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు.

ఉపాధి హామీ లో ఇద్దరి మరణానికి కారణమైన ఘటనపై జిల్లా అధికారులతో విచారణకు ఆదేశించారు. గాయపడిన మరో ఇద్దరికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. మరణించిన ,గాయపడిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా కల్పించారు.

Whats_app_banner