TG TET Applications: నేటి నుంచి తెలంగాణ టెట్ 2024 దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం-acceptance of telangana tet 2024 applications from today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Tet Applications: నేటి నుంచి తెలంగాణ టెట్ 2024 దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం

TG TET Applications: నేటి నుంచి తెలంగాణ టెట్ 2024 దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 05, 2024 09:36 AM IST

TG TET Applications: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తారు. టెట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

నేటి నుంచి తెలంగాణ టెట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
నేటి నుంచి తెలంగాణ టెట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం

TG TET Applications: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ పాఠ శాల విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నోటిఫికేషన్‌ను టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024- 25గా పేర్కొన్నారు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, తెలంగాణ టెట్ చైర్మన్, ఈవీ నరసింహారెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు.

నవంబర్ఈ 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్‌ పరీక్ష దరఖాస్తులు స్వీకరిస్తారు. టెట్‌ విద్యార్హతలు, సెకండరీ గ్రేడ్‌, స్కూల్‌ అసిస్టెంట్ సబ్జెక్టులు, అర్హతల వివరాలను మంగళవారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆన్లైన్ పరీక్షలను జనవరి 1-20 తేదీల మధ్య నిర్వహిస్తారు. తెలంగాణలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను కూడా గతంలోనే విడుదల చేసింది.

టెట్‌ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయిన నోటిఫికేషన్‌ విడుదలలో పేర్కొన్నారు. పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. మొత్తం150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ అభ్యర్థులకు-90 మార్కులు, బీసీలకు 75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే టెట్‌ ఉత్తీర్ణులుగా గుర్తిస్తారు. రిజర్వేషన్ల ఆధారంగా నిర్దేశిత మార్కులు సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం లభిస్తుంది.

ప్రాథమిక పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్-1లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసి స్టెంట్ ఉద్యోగాలకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-2లో గణితం, సైన్స్, సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. టెట్‌ పరీక్షల్లో ఒకసారి పాసైతే ఆ స్కోర్కు జీవితకాలు గుర్తింపు ఉంటుంది. 2022 నుంచి ఈ మేరకు నిబంధనలు మార్చారు.

టెట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులకు డిఎస్సీ నియామకాల్లో 20% వెయిటేజ్ ఇస్తారు. టెట్ అర్హత మార్కుల్లో పురోగతి కోసం పలువురు పరీక్షలకు దరఖాస్తు చేస్తున్నారు. టెట్ పరీక్షల ఫీజు గతంలో రూ. 100 ఉండేది. దానిని గత టెట్‌ నిర్వహణలో రూ. 1000కి పెంచారు. దీనిపై అభ్య ర్థులు ఆందోళనలు వ్యక్తం చేసినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని సిఎం ప్రకటించారు.

కొద్ది నెలల క్రితం తెలంగాణలో 2.35 లక్షల మంది టెట్‌పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1.10లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కొత్త నోటిఫికేషన్ వెలువడటంతో వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Whats_app_banner