Nirmal ACB Trap: నిర్మల్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన మహిళా ఎస్సై, కానిస్టేబుల్.. కల్లు వ్యాపారి నుంచి వసూలు-acb catches female si constable in nirmal district recovers from toddy dealer ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nirmal Acb Trap: నిర్మల్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన మహిళా ఎస్సై, కానిస్టేబుల్.. కల్లు వ్యాపారి నుంచి వసూలు

Nirmal ACB Trap: నిర్మల్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన మహిళా ఎస్సై, కానిస్టేబుల్.. కల్లు వ్యాపారి నుంచి వసూలు

HT Telugu Desk HT Telugu

Nirmal ACB Trap: కల్లు వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ ఎక్సైజ్‌ ఎస్సై ఏసీబీకి చిక్కిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. తన పరిధిలో మరొకరు వ్యాపారం చేస్తున్నారని కల్లు వ్యాపారి ఫిర్యాది చేస్తే, అతని నుంచి నుంచి లంచం డిమాండ్‌ చేసి ఏసీబీకి పట్టుబడటం కలకలం రేపింది.

ఏసీబీకి చిక్కిన నిర్మల్ ఎక్సైజ్ ఎస్సై

Nirmal ACB Trap: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో మంగళవారం రాత్రి ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించగా ఎక్సెజ్ మహిళా ఎస్సై, ఓ మహిళా కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భైంసా మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు తెల్ల కల్లు వ్యాపారులు తమకు అనుమతించిన పరిధిలో తెల్లకల్లు అమ్ముకునే విషయంలో వివాదం తలెత్తింది.

నిర్మల్‌ జిల్లాలోని కమోల్‌ గ్రామానికి చెందిన కల్లు వ్యాపారి సుభాష్‌ గౌడ్ ఇటీవల ఒకరు తెల్లకల్లు అమ్మకం తమకు కేటాయించిన పరిధి కాకుండా ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారని ఫిర్యాదు చేశాడు. బాధితుడి సుభాష్‌ గౌడ్‌ హద్దులోకి ఇతరులు రాకుండా చూసుకోడానికి .మహిళా ఎస్సె దాదాపు పదివేల రూపాయల లంచం అడిగినట్లు ఫిర్యాదు దారుడు ఏసీబీకి సమాచారం అందించాడు.

దీంతో పక్కా సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా ఎస్సై, కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిర్మల్ లో గత ఆరు నెలల్లో 12వ ఏసీబి దాడులు కావడం గమనార్హం.

(రిపోర్టింగ్: కామోజీ వేణుగోపాల్, ఉమ్మడిదలాబాద్ జిల్లా హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం