ABVP Bandh: ఏబీవీపీ బంద్ కారణంగా.. రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన పలు యాజమాన్యాలు-abvp has called for a school bandh on june 26 few managements have announced holidays for schools ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Abvp Bandh: ఏబీవీపీ బంద్ కారణంగా.. రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన పలు యాజమాన్యాలు

ABVP Bandh: ఏబీవీపీ బంద్ కారణంగా.. రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన పలు యాజమాన్యాలు

HT Telugu Desk HT Telugu

ప్రయివేటు పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి తదితర అంశాలకు నిరసనగా ఏబీవీపీ రేపు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.

రేపు ఏబీవీపీ బంద్ కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించిన పలు యాజమాన్యాలు (HT_PRINT)

ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ డిమాండ్ చేసింది. అలాగే పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ 26న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈమేరకు తెలంగాణ ఏబీవీపీ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు పాఠశాలలు ముందస్తు చర్యగా సెలవు ప్రకటించాయి. దీనికి బదులుగా మరో సెలవు రోజును పని దినంగా పాఠించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశాయి. కొన్ని పాఠశాలలు ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించాయి.