Medak Rescue: చేపలు పట్టడానికి వాగులోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడు, కాపాడిన పోలీసులు
Medak Rescue: చేపలు పట్టడానికని వాగులోకి దిగి ప్రాణాల మీదికి తెచుకున్నాడో యువకుడు, ప్రాణాలకు తెగించి తనను కాపాడరు స్థానికుల యువకులు మెదక్ పోలీసులు. ఈ సంఘటన, మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల పరిధిలో జరిగింది.
Medak Rescue: చేపలు పట్టడానికని వాగులోకి దిగి ప్రాణాల మీదికి తెచుకున్నాడో యువకుడు, ప్రాణాలకు తెగించి తనను కాపాడరు స్థానికుల యువకులు మెదక్ పోలీసులు. ఈ సంఘటన, మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల పరిధిలో జరిగింది. జిల్లాలో భారీ వర్షాలు రావటంతో, టేక్మాల్ మండలంలోని గుండు వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నది.
అయితే, ఇదే అదనుగా షాబాద్ గ్రామానికి చెందిన రమావత్ నంద్యా నాయక్, సేవాలాల్ నాయక్ తండా వద్ద ఉన్నచెక్ డ్యామ్ వద్ద చేపలు పట్టడానికి చెక్ డ్యామ్ మీదకు ఎక్కి వాగు మధ్యలోకి వెళ్ళాడు. తాను చేపలు పెట్టె ప్రయత్నంలో ఉండగానే, వరద ఉదృతి తీవ్రంగా పెరిగింది. నంద్యా నాయక్ ఒక్కసారిగా, వరదలో కొట్టకుపోసాగాడు.
కొంత దూరం వరదలో కొట్టపోయిన తర్వాత, అదృష్టవశాత్తు తన చేతికి ఒక పెద్ద రాయి తగలడంతో, తాని పట్టుకొని ప్రాణాలు నిలుపుకున్నాడు. తరవాత, సహాయం కోసం బిగ్గరగా అరవటం మొదలుపెట్టాడు. ఇది గమనించిన, స్థానిక సేవాలాల్ నాయక్ తండా వాసులు తనను కాపాడడానికి ప్రయత్నించినా, వరద ఉదృతి వలన తన దగ్గరికి వెళ్లలేని పరిస్థితి.
స్థానిక యువకులు, వెంటనే టేక్మాల్ పోలీసులకు సమాచారం అందించారు. టేక్మాల్ ఇన్స్పెక్టర్ రేణుకా రెడ్డి విషయాన్నీ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళటంతో, ఎస్పీ వెంటనే క్విక్ రియాక్షన్ టీం ని టేక్మాల్ మండలానికి పంపించాడు. ఇదంతా జరుగుతుండగా, నంద్యా నాయక్ గంటకు పైగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తుండి పోయాడు. వరద ఉదృతి నిమిష నిమిషానికి పెరగడటంతో, తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు.
అయితే, క్విక్ రియాక్షన్ టీం లోని హోమ్ గార్డ్ మహేష్, ఇద్దరు స్థానిక యువకులు తాడు సహాయంతో వరద ఉదృతిని తట్టుకుని చెక్ డ్యామ్ మీదుగా నడుసుకుంటూ, నంద్యా నాయక్ దగ్గరికి వెళ్లారు. వారు నంద్యా నాయక్ కు తాడు విసరడంతో, తాను అతికష్టం మీద తాడుని పట్టుకొని వరద ఉధృతికి ఎదురుగా ఈదుకుంటూ చెక్ డ్యామ్ పైకి ఎక్కాడు. ఆ తరువాత చెక్ డ్యామ్ పై నడుసుకుంటూ వడ్డుకు రావటంతో, స్థానికులు ఆనందంలో మునిగిపోయారు.
నంద్యా నాయక్ ప్రాణాలతో బయటపడటంతో, తన కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాలు, వరదల దృష్ట ఎవరు కూడా వాగులు, నదులు, చెరువుల దగ్గరికి వెళ్లొద్దు అని అధికారులు ఎన్ని సార్లు అవగాహన కల్పించిన ప్రజలు తమ పద్దతి మార్చుకోకుండా తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నసంఘటనలు జరగడం ముదావహం.
ఇబ్బందులు ఉంటె పోలీసులకు ఫోన్ చేయండి: ఎస్పీ
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు పట్టణాలు గ్రామాలు జలమయమయ్యాయి, చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కాలనీలు నివాసాలు నీటితో నిండి ఉండగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ అప్రమత్తమై జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలలో వరద ప్రాంతాల్లో పోలీసు సహాయక చర్యలను విస్తృతం చేశామన్నారు.
క్లిష్ట పరిస్థితుల దృష్ట ప్రజలు బయటికి రావద్దని, శిథిలవస్థలో ఉన్న నివాసాల్లో ఉండవద్దు, దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తుంది. సెల్ఫీ లాంటి దిగడం వరద ప్రాంతాలకు వెళ్లడం చాలా ప్రమాదమని జిల్లా యంత్రాంగం తో కలిసి జిల్లా పోలీస్ శాఖ సహాయక చర్యలు కొనసాగిస్తుంది.
అత్యవసర సమయాల్లో డయల్ 100 కు, స్థానిక పోలీసులకు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ 87126 57888 ఫోన్ చేసి పోలీసు సాయాన్ని పొందవచ్చు అని అన్నారు.చెరువు కట్టలు తెగిన ప్రాంతాలు, పొంగి పొర్లుతున్న నదుల వద్ద సాహాయక చర్యల్లో భాగంగా నిఘా ఉంచామన్నారు.