Travels bus Rape case: హైదరాబాద్‌లో ఘోరం, ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం-a tragedy in hyderabad the driver raped a passenger in a travel bus ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Travels Bus Rape Case: హైదరాబాద్‌లో ఘోరం, ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం

Travels bus Rape case: హైదరాబాద్‌లో ఘోరం, ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం

Sarath chandra.B HT Telugu
Jul 30, 2024 01:39 PM IST

Travels bus Rape case: హైదరాబాద్‌లో ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో ఓయూ పోలీసులు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.

హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం
హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం

Travels bus Rape case: హైదరాబాద్‌లో ప్రయాణికురాలిపై డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా నుంచి నిర్మల్ వెళుతున్న హరికృష్ణ ట్రావెల్స్‌ స్లీపర్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలి కేకలు వేయడంతో అప్రమత్తమైన తోటి ప్రయాణికులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. బస్సు ఓయూ పోలీస్ స్టేషన్‌ పరిధిలో వెళుతున్నట్టు గుర్తించి వెంటనే బస్సును అడ్డుకున్నారు.

yearly horoscope entry point

స్లీపర్ బస్సును ఓయూ పిఎస్‌కు తరలించారు. బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లలో కృష్ణ అనే డ్రైవర్‌ ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ బస్సు ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్‌ మీదుగా నిర్మల్ వెళ్లాల్సి ఉంది. బస్సులో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో అదునుగా భావించి ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టు భావిస్తున్నారు.

యువతిపై సామూహిక అత్యాచారం..

వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘటనలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. హోటల్లో పార్టీ కోసం వచ్చిన యువతిని తీసుకెళ్లి ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి సమాచారం ఆధారంగా కేసు నమోదు చేశారు. స్నేహితుడితో పాటు మరో వ్యక్తి తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం రావడంతో పార్టీ ఇచ్చేందుకు వచ్చిన యువతిపై స్నేహితుడు మరో వ్యక్తితో కలిసి అత్యాచారం చేశారు. గౌతమ్‌ రెడ్డి అనే వ్యక్తి వనస్థలిపురంలో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెసిడెన్సీలో స్నేహితురాలితో కలిసి సోమవారం సాయంత్రం మద్యం సేవించారు. అనంతరం హోటల్‌ గదికి వెళ్లారు. ఉద్యోగం రావడంతో పార్టీ ఇవ్వాలని కోరడంతోనే తాను హోటల్‌కు వచ్చినట్టు బాధితురాలు చెబుతోంది. మద్యం మత్తులో ఉన్న తనపై అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేసింది. బాధితురాలితో పాటు పార్టీలో పాల్గొన్న యువకులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.

Whats_app_banner