Suicide for Online Games: విద్యార్ధిని బలిగొన్న ఆన్‌లైన్ గేమ్స్…
Suicide for Online Games: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మైహోమ్ బుజాలో చోటు చేసుకుంది. మైహోం బుజా జే బ్లాక్ పై నుంచి దూకి 14ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Suicide for Online Games: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మైహోమ్ బుజాలో చోటు చేసుకుంది. మైహోం బుజా జే బ్లాక్ పై నుంచి దూకి 14ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాయదుర్గంలో గత రాత్రి అదృశ్యమైన పదో తరగతి విద్యార్థి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి బాలుడు బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సోమవారం రాత్రి 7.30 గంటలకు బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
ఎంతకీ తిరిగి ఇంటికి రాక పోవడంతో అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కుమారుడి కోసం వెతికారు. అర్ధరాత్రి దాటాక 2 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి.. బాలుడి ఆచూకీ కోసం పలుచోట్ల వెతికారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 7గంటలకు బాలుడి కుటుంబం నివాసముంటున్న అపార్ట్‌మెంట్ పక్క బ్లాక్ ముందు రక్తపు మడుగులో పడి ఉన్న అతడి మృతదేహాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఆత్మహత్య చేసుకున్న 14ఏళ్ల బాలుడు కొన్ని రోజులుగా విద్యార్థి ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారినట్లు దర్యాప్తులో గుర్తించారు. చదువులో వెనుకబడటంతో తల్లిదండ్రులు మందలించారు. వీడియో గేమ్స్ మాయలో పడి చదవలేకపోవడం, చదువు విషయంలో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.