sangareddy crime: పుష్ప సినిమా తరహాలో టాటా సఫారీలో సీక్రెట్ ప్లేస్.. 83 కిలోల గంజాయి స్వాధీనం
sangareddy crime: పుష్ప సినిమా రేంజ్ లో అక్రమంగా తరలిస్తున్న రూ. 33 లక్షల విలువైన 83. 4 కిలోల ఎండు గంజాయిని, సంగారెడ్డి జిల్లా కంకోల్ చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ని అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
sangareddy crime: పుష్ప సినిమా రేంజ్ లో అక్రమంగా తరలిస్తున్న రూ. 33 లక్షల విలువైన 83. 4 కిలోల ఎండు గంజాయిని, సంగారెడ్డి జిల్లా కంకోల్ చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ని అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆ తనిఖీలలో భాగంగా అక్కడి నుండి వెళ్తున్న ఓ టాటా సఫారీ కారును అపి తనిఖీ చేసినా, ఆ కారులో ఏమి దొరకలేదు. అంతలోనే పోలీసులకు కారుపై అనుమానం కలిగింది. కారుని ఆపి డ్రైవర్ ని ప్రశ్నించగా, అతడు పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం మరింత బలపడింది.
కారు సీట్ల కింద ప్రత్యేక పెట్టెలు ....
ఆ తర్వాత మరల కారులో తనిఖీ నిర్వహించిన అధికారులు చూసి షాక్ అయ్యారు. ఆ కారులో ఎవరికీ అనుమానం రాకుండా పుష్ప సినిమా రేంజ్ లో కారు సీట్ల కింద భాగంలో ప్రత్యేక పెట్టెలను ఏర్పాటు చేశారు. ఆ పెట్టెలలో చిన్న, చిన్న మూటలుగా గంజాయిని అమర్చి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ పెట్టెలలో ఉన్న 83. 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 33. 5 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
వ్యక్తితో పాటు వాహనం సీజ్ …
కారు డ్రైవర్ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఏవోబీ నుండి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తితో పాటు సెల్ ఫోన్ ను,టాటా సఫారీ వాహనాన్ని పోలీసులు సీజ్ చేసారు.
గంజాయి తరలించడం కోసం కారునే తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలిపారు. సినిమా రేంజ్ లో కారు సీటు కింద బాక్సులు ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వారు వివరించారు.
నర్సాపూర్ లో చోరీ ఘటన …
తాళం వేసి ఉన్న రెండిళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీ చేసి 20 తులాల వెండి, రూ. 25 వేల నగదు ఎత్తుకెళ్లిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల ముత్యాలు, శ్రీనాధ్ ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇంటికి వెళ్లారు.
అదే అదునుగా భావించిన దుండగులు ఇరువురి ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. కాగా ఎర్రగొల్ల ముత్యాలు ఇంట్లో 20 తులాల వెండి, రూ.15 వేల నగదు చోరీ చేసారు. అదేవిధంగా శ్రీనాధ్ ఇంట్లో రూ. 10 వేల నగదు అపహరించారు. బంధువుల ఇంటి నుండి తిరిగి వచ్చిన ముత్యాలు తమ ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే బాధితుడు పోలీసులకు పిర్యాదు చేసారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.