Suryapet: స్విమ్మింగ్‌పూల్‌లో పడి.. అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి-a resident of suryapet district died after falling into a swimming pool in america ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Suryapet: స్విమ్మింగ్‌పూల్‌లో పడి.. అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి

Suryapet: స్విమ్మింగ్‌పూల్‌లో పడి.. అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి

Basani Shiva Kumar HT Telugu
Aug 26, 2024 11:06 AM IST

Suryapet: తెలంగాణకు చెందిన మరో వ్యక్తి అమెరికాలో మృతిచెందారు. ఇటీవల రాజేష్ అనే యువకుడు మృతిచెందగా.. తాజాగా సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రవీణ్ చనిపోయారు. ప్రవీణ్ మృతితో పాతర్లపహాడ్ గ్రామంలో విషాదం నెలకొంది.

అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి
అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి ((HT))

అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి చెందారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రవీణ్‌.. స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతి చెందారు. ఐదేళ్ల కిందట అమెరికా వెళ్లిన ప్రవీణ్‌.. అక్కడ టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌ స్వస్థలం ఆత్మకూర్‌ ఎస్‌ మండలం పాతర్లపహాడ్ గ్రామం. ప్రవీణ్ మృతితో పాతర్లపహాడ్ గ్రామంలో విషాదం నెలకొంది.

ఇటీవలే రాజేష్ మృతి..

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఏరుకొండ నీలమ్మ, సాంబయ్య దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు ఏరుకొండ రాజేష్ (32) కొంత కాలం కిందట ఎంఎస్ చదివేందుకు అమెరికాలోని మిస్సిస్సిపి రాష్ట్రానికి వెళ్లాడు. చదువులు పూర్తి చేసి ఇప్పుడు అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉండగా కొద్ది రోజుల కిందట రాజేష్ కాలికి గాయమైంది. దీంతో దానికి సంబంధించిన చికిత్స తీసుకున్న రాజేష్ అదే విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు. ఇంతలోనే ఏం జరిగిందో కానీ రాజేష్ అనారోగ్యంతో మృతి చెందాడు.

ఏడాది కిందట తండ్రి మరణం..

2015లో అమెరికా వెళ్లిన రాజేష్ అక్కడే ఉంటుండగా.. అతడి తండ్రి సాంబయ్య ఏడాది కిందట అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. దీంతో దహన సంస్కారాలు పూర్తి చేసేందుకు రాజేష్ ఇక్కడికి వచ్చాడు. కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన అనంతరం తిరిగి అమెరికా ప్రయాణం అయ్యాడు. తొందర్లోనే తిరిగి వస్తానని తన తల్లితో పాటు ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పి వెళ్లి పోయాడు. ఇప్పుడు అనారోగ్య సమస్యలతో మరణించడంతో ఆత్మకూరు మండల కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది.