Medak News : ప్రమాదవశాత్తు వివాహితుడు మృతి...! గంటల వ్యవధిలోనే యువతి ఆత్మహత్య - కారణం ఇదే..!
Medak Crime News : మెదక్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి అయిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందగా… అతనిలో ప్రేమలో ఉన్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రమాదవశాత్తు ఓ వివాహితుడు మరణించిన గంటలోపే.. అతనితో ప్రేమలో ఉన్న యువతి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే…. జగదేవపూర్ మండలంలోని లింగారెడ్డిపల్లికి చెందిన కొమురవెల్లి సత్యం (31) తన గ్రామంలోని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ట్రాక్టర్ నడుపుతూ… తన భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు.
గురువారం రోజు సత్యం తన పొలం దున్నేందుకు వెళ్లాడు. కాసేపు పని చేసిన తర్వాత… బోరు పైపుని ఒక మడి నుండి మరొక మడిలోకి మార్చాడు. మళ్లీ ట్రాక్టర్ ఎక్కుతుండగా… సత్యం జారీ కిందపడిపోయాడు, ఇంతలోనే కేజీ వీల్స్ తో ఉన్న ట్రాక్టర్ ముందుకు కదలటంతో…. తను మీదుగా వెళ్లటం అంత క్షణాల్లోనే జరిగింది. ఈ ప్రమాదంలో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. పక్క పొలంలో పని చేసుకుంటున్న రైతులు గుర్తించి… అక్కడికి చేరుకున్నారు. ట్రాక్టర్ కింది నుండి అతికష్టం మీద తీసి గజ్వేల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా… మార్గమధ్యలోనే మరణించాడు.
ప్రియుడి చనిపోయిన విషయం తెలిసి........
ఈ విషయం తెలిసి… తనతో గత కొంత కాలంగా సన్నిహితంగా మెలుగుతున్న అదే గ్రామానికి చెందిన చిక్కుడు జ్యోతి (22) అనే యవతి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. సత్యం లేని జీవితం తనకు వద్దని… క్షణికావేశంలో తన ఇంట్లోనే ఉరి పెట్టుకుని ఆత్మహత్యయత్నం చేసింది. అది గమనించిన తన తల్లి మల్లమ్మ, ఇరుగుపొరుగు వారిని పిలవటంతో… వారు జ్యోతి ని కిందికి దించి గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ, తనను పరిశీలించిన డాక్టర్లు జ్యోతి అప్పటికే మరణించినట్టు తెలిపారు, ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది .
జ్యోతి హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రిల ఉద్యోగం చేస్తోంది. ఏకాదశి పండుగ వేళ గ్రామానికి వచ్చి ఇక్కడే ఉన్నదని గ్రామస్తులు తెలిపారు. తన కుటుంబంలో జ్యోతి అందరికంటే చిన్నది. పెద్ద కూతుర్లకు ఇద్దరికీ పెళ్లి కాగా…జ్యోతికి ఇంకా పెళ్లి కాలేదు. జ్యోతి పెళ్లి కూడా చేసి తన బరువు దించుకోవాలనే ప్రయత్నంలో తల్లి గత కొంతకాలంగా ఉంది. ఈ అనుకోని సంఘటనతో…. జ్యోతి కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
మరోవైపు సత్యం అకాల మరణంతో తన భార్య… ఏడేళ్ల కూతురు, ఐదు సంవత్సరాల కొడుకు దిక్కులేనివారయ్యారు. రైతు సత్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేసారు. సత్యం, జ్యోతి శవాలకు గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది.
ఔటర్ రింగురోడ్డు పై ప్రమాదం..
సుల్తాన్పూర్ ఔటర్ రింగురోడ్డు పై ప్రమాదం జరిగింది. కారు నుంచి దిగి మూత్ర విసర్జనకు దిగిన మోక్షిత్ రెడ్డి (6)ని గుర్తు తెలియని వాహనం టైరు ఊడి వచ్చి తగిలింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలు కాగా… ఆసుపత్రిలో చికిత్స పొందతూ మృతి చెందాడు. మృతుడు అమీను పూర్ మండలం పటేల్ గూడ గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి కుమారుడిగా గుర్తించారు.
రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.
టాపిక్