Hyderabad : ఉప్పల్ లోని ప్రైవేట్ స్కూల్ లో దారుణం - 2వ తరగతి చిన్నారితో 9వ తరగతి విద్యార్థి అసభ్య ప్రవర్తన..!-a class 9 student molested a class 2 student in uppal private school hyderabd ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : ఉప్పల్ లోని ప్రైవేట్ స్కూల్ లో దారుణం - 2వ తరగతి చిన్నారితో 9వ తరగతి విద్యార్థి అసభ్య ప్రవర్తన..!

Hyderabad : ఉప్పల్ లోని ప్రైవేట్ స్కూల్ లో దారుణం - 2వ తరగతి చిన్నారితో 9వ తరగతి విద్యార్థి అసభ్య ప్రవర్తన..!

Hyderabad Crime News: ఉప్పల్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాలలో దారుణం జరిగింది. రెండో తరగతి విద్యార్థినిపై తొమ్మిదో తరగతి విద్యార్థి అసభ్యకరంగా ప్రవర్తించాడు. స్కూల్ ఎదుటు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

ఉప్పల్ లోని ప్రైవేట్ స్కూల్ లో దారుణం representative image (image source from https://unsplash.com/)

Hyderabad Crime News: హైదరాబాద్ ఉప్పల్ లోని ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్ లో దారుణం వెలుగు చూసింది. రెండో తరగతి చదువుతున్న ఓ చిన్నారిపై తొమ్మిదో తరగతి విద్యార్థి అసభ్యకరమైన చేష్టలకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది.

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు… ఇవాళ పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఓ దశలో పాఠశాలపై దాడికి యత్నించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమాచారం తెలిసిన పలు విద్యార్థి సంఘాలు…. ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో పాఠశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఫోన్ ఛార్జర్ పిన్ను నోట్లో పెట్టుకొని చిన్నారి మృతి

సెల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకుని షాక్ తో ఏడాదిన్నర బాలిక మృతి చెందింది. ఈ సంఘటన నిర్మల్ జిల్లాలోని కడెం మండలం కొత్త మద్దిపడగలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే… కొత్తమద్దిపడగ గ్రామానికి చెందిన దుర్గం సుశీల రాజలింగు దంపతులకు ఆరాధ్య ఇరువురు కుమార్తెలున్నారు. చిన్న కుమార్తె ఆరాధ్య (08) గురువారం రాత్రి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్న సమయంలో ఆడుకుంటూ వెళ్లి చార్జింగ్ కేబుల్ ని పట్టు కొని నోట్లో పెట్టుకుంది.

ఛార్జింగ్ కేబుల్ కి స్విచ్ వేసి ఉండడంతో ఒక్కసారిగా షాక్ కొట్టడంతో అక్కడికక్కడే పాప స్పృహ కోల్పోయింది. దీంతో వెంటనే చిన్నారి ఆరాధ్యను తల్లిదండ్రులు ఇద్దరు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆరాధ్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో క్షణం క్రితం వరకు తమ కళ్ల ఎదుట సందడిగా కదలాడిన తమ బిడ్డ విగతజీవిగా మారి మృతి ఒడిలోకి వెళ్లడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆసుపత్రిలో తమ కూతురిని చూసి వారు రోధించిన తీరు అక్కడున్న వారిని కలచి వేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఛార్జింగ్ కేబుల్స్, సెల్ ఫోన్లు చిన్నారులకు వీలైనంత దూరంగా ఉంచాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఆరాధ్య మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.