Medchal News : మేడ్చల్ లో దారుణం... 80 ఏళ్ల వృద్ధురాలిపై గ్యాంగ్ రేప్!
మేడ్చల్ జిల్లా పరిధిలో దారుణం వెలుగు చూసింది. 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా… మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతమైన మేడ్చల్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. 80 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు వ్యక్తులు అత్యాాచారానికి పాల్పడ్డారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మేడ్చల్ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒంటరిగా నివసిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలిపై బలవంతంగా ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. అత్యాచారం తర్వాత నిందితులు పారిపోయారని పోలీసులు తెలిపారు. బాధితురాలు స్పృహాలోకి వచ్చి రోడ్డుపైకి వచ్చిందని పేర్కొన్నారు. ఆమెను గమనించిన స్థానికులు విషయం తెలుసుకొని… 100 ఫోన్ చేసి సమాచారం అందించారని పేర్కొన్నారు.
పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులు కూడా వృద్ధురాలు నివాసం ఉంటున్న గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో ఇద్దరు యువకులు ఉన్నారు.
బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఆస్పత్రికి తరలించారు. లైంగిక దాడికి పాల్పడిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా… మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసును మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.