ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియదు పాపం.. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు-8 young children died in gulzar house fire in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియదు పాపం.. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు

ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియదు పాపం.. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు

వారు ఇంకా నిద్ర కూడా లేవలేదు. అప్పుడే మంటలు, పొగ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఒక్కసారిగా ఊపిరాడలేదు. ఏం చేయాలో కూడా తెలియదు. తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలియని చిన్నారులు.. అగ్నికి ఆహుతయ్యారు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది చిన్నారులు చనిపోయారు.

ఘటనా స్థలంలో సహాయక చర్యలు

మాటలకందని విషాదం ఇది. పొద్దున నిద్ర లేవకముందే.. అగ్నిప్రమాదం రూపంలో యమపాశం దూసుకొచ్చింది. ఏటూ కదలకుండా చేసి.. ప్రాణాలు తీసింది. హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది వరకు చనిపోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉండటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

ఏడాదిన్నర బాలుడు..

ఈ 8 మంది చిన్నారుల్లో ఒకరి వయస్సు ఒకటిన్నర ఏండ్లే. మరొకరికి ఏడేళ్లు. నాలుగు ఏళ్ల లోపు పిల్లలు ఆరుగురు చనిపోయారు. వీరే కాకుండా మృతుల్లో వృద్ధులు ఉన్నారు. నలుగురు అరవై ఏళ్ల నుంచి డెబ్బై ఏళ్ల వయస్సు వారు ఉన్నారు. మృతుల్లో ఐదుగురు ముప్పై నుంచి నలభై ఏళ్ల లోపు వయస్సు వారున్నారు. ఈ ఘటనతో చార్మినార్ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.

మృతుల వివరాలు..

ఎస్టీఆర్ఎఫ్ ప్రకారం మృతుల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రహల్లాద్ (70)

మున్ని (70)

రాజేందర్ మోదీ (65)

సుమిత్ర (60)

పంకజ్ (36)

షీతల్ (35)

వర్ష (35)

రజినీ (32)

అభిషేక్ (31)

హమి (07)

ప్రియాంశ్ (04)

రిషబ్ (04)

ఇద్దు (04)

అనుయాన్ (03)

ఆరుషి (03)

ఇరాజ్ (02)

ప్రాతమ్ (1.5)

ప్రమాదం ఎలా జరిగింది..

షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జార్‌ హౌస్‌ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో.. శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులుపడ్డారు.

కొంప ముంచిన ఏసీ కంప్రెషర్..!

ఏసీ కంప్రెషర్ పేలి మంటలు చెలరేగినట్టు అధికారులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంప్రెషర్‌లో ఒత్తిడి బాగా పెరిగితే అది పేలవచ్చు అని అంటున్నారు. రెఫ్రిజెరాంట్ ఎక్కువ నింపడం లేదా సిస్టమ్‌లో అడ్డంకులు ఏర్పడి మంటలు రావొచ్చని అనుమానిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర విద్యుత్ సమస్యల వల్ల కూడా కంప్రెషర్ వేడెక్కి మంటలు రావొచ్చని చెబుతున్నారు.

సంబంధిత కథనం