రాష్ట్రంలో భారీగా భూ సమస్యలు...! 8 లక్షలకు పైగా దరఖాస్తులు, ఆగస్టు 15 డెడ్ లైన్-8 lakh above applications received during revenue sadassulu under bhu bharati act key details here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రాష్ట్రంలో భారీగా భూ సమస్యలు...! 8 లక్షలకు పైగా దరఖాస్తులు, ఆగస్టు 15 డెడ్ లైన్

రాష్ట్రంలో భారీగా భూ సమస్యలు...! 8 లక్షలకు పైగా దరఖాస్తులు, ఆగస్టు 15 డెడ్ లైన్

రాష్ట్రంలో తలపెట్టిన రెవెన్యూ సదస్సులు ముగిశాయి. భూ స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యల‌‌‌‌‌‌‌‌పై 8 ల‌‌‌‌‌‌‌‌క్షలకుపైగా దరఖాస్తులు అందాయి. 3 ద‌‌‌‌‌‌‌‌శ‌‌‌‌‌‌‌‌ల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భారీగా అప్లికేషన్లు వచ్చాయి. సమస్యల పరిష్కారానికి ఆగస్టు 15వ తేదీని డెడ్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌ గా నిర్ణయించారు.

రాష్ట్రంలో ముగిసిన రెవెన్యూ స‌ద‌స్సులు

రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు భారీగా వెల్లువెత్తాయి. కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమల్లోకి వచ్చాక తెలంగాణ సర్కార్… చేపట్టిన మూడు విడతల సదస్సుల్లో 8 ల‌‌‌‌‌‌‌‌క్షలకుపైగా దరఖాస్తులు అందాయి. ఏప్రిల్ 17 నుంచి 30 వరకు నాలుగు మండలాల్లో ముందుగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ తర్వాత రెండో దశ కింద మరో 28 మండలాల్లో దరఖాస్తులను స్వీకరించారు. మూడో విడతగా మిగిలిన మండలాల్లో నిర్వహించారు.

రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు - ముఖ్య వివరాలు..

  • ఏప్రిల్ 14వ తేదీన భూ భారతి చ‌ట్టాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆరోజు నుంచే రెవెన్యూ వ్య‌వ‌స్ద‌లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.
  • ఈ చ‌ట్టాన్ని ద‌శ‌ల వారీగా అమ‌లులోకి తీసుకువచ్చారు. మొద‌టి ద‌శ‌లో ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వ‌ర‌కు 4మండ‌లాల్లో నిర్వ‌హించిన 72 రెవెన్యూ స‌ద‌స్సుల్లో 12వేల ద‌ర‌ఖాస్తులు అందాయి.
  • ఆ త‌ర్వాత రెండ‌వ‌ ద‌శ‌లో మే 5వ తేదీ నుంచి 28 మండ‌లాల్లో నిర్వ‌హించిన 414 స‌ద‌స్సుల్లో 46 వేల ద‌ర‌ఖాస్తులు అందాయి. సాదాబైనామాల అంశం మిన‌హా సుమారు 60 శాతంపైగా స‌మ‌స్యల‌కు పరిష్కారం చూపారు.
  • జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు 561 మండ‌లాల్లో 10,239 గ్రామాల్లో రెవెన్యూ స‌ద‌స్సులను నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సుల్లో భూ స‌మ‌స్య‌ల‌కు సంబంధించి 8 ల‌క్ష‌లకుపైగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.
  • మొత్తంగా మూడు విడ‌తల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇందులో 8.58 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివ‌రించారు.
  • అత్య‌ధికంగా ఖ‌మ్మం జిల్లాలో 67 వేలు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం 61వేలు, వ‌రంగ‌ల్ 54 వేలు, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి 48వేలు, నల్గొండ 42 వేల ద‌ర‌ఖాస్తులు అందాయి.
  • రెవెన్యూ స‌ద‌స్సుల‌కు ముందురోజే ఆయా గ్రామాల్లో రైతుల‌కు ఉచితంగా ద‌ర‌ఖాస్తుల‌ను పంపిణీ చేశారు. స్వీక‌రించిన‌ వాటికి ర‌శీదుల‌ను అంద‌జేశారు.
  • వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 3.27 ల‌క్ష‌ల ద‌రఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో న‌మోదు చేశారు. మిగిలిన వాటిని కూడా త్వ‌రిత‌గ‌తిన న‌మోదు చేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.