గతంలో రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లు ఉండేవారు. వీరు భూములకు సంబంధించిన క్షేత్రస్థాయి రికార్డులను నిర్వహించేవారు. అలాగే పలు ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా వ్యవహరించేవారు. అయితే.. ఆ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ సిబ్బందిని ఇతర శాఖలకు బదలాయించి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ప్రభుత్వం.. గతంలో వీఆర్‌ఏ, వీఆర్వోలుగా పనిచేసిన అనుభవం ఉన్న వారికి జీపీవోలుగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసే నాటికి.. వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేస్తూ ఉండేవారు. రెవెన్యూ వ్యవస్థ రద్దు చేయడంతో వారిని ఇతర శాఖలకు సర్దుబాటు చేశారు.
2 వీరిలో.ఇంటర్ విద్యార్హతతో 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారు, డిగ్రీ విద్యార్హతతో నేరుగా జీపీవోల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
3.దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అధికారులు.. కొందరిని రాత పరీక్షకు అర్హులుగా నిర్ధరించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి జూన్ 2నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో జీపీవోలుగా సేవలు అందించనున్నారు.
4.రెవెన్యూ గ్రామానికి ఒకరి చొప్పున నియమించాల్సి ఉండగా.. పరీక్షలకు కొందరు మాత్రమే అర్హత సాధించారు. ఇందులో ఎంత మంది ఉత్తీర్ణత సాధిస్తారో వారిని నియమించి.. మిగిలిన వారి కోసం ప్రభుత్వ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి.
5.గ్రామస్థాయిలో అధికారులను నియమిస్తే.. పరిపాలన మెరుగుపడే అవకాశాలు ఉంటాయని భావించిన ప్రభుత్వం.. గ్రామ పాలన అధికారి వ్యవస్థను తెరపైకి తెచ్చింది.
6.జీపీవోలతో గ్రామాల్లో రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భూమికి సంబంధించిన పట్టాలు, రికార్డుల నిర్వహణ, భూముల సరిహద్దుల వివాదాల పరిష్కరించేందుకు వీరు ఉన్నతాధికారులకు సహాయపడనున్నారు.
7.భూ ఆక్రమణలతో పాటు అనధికార విక్రయాలపై చర్యలు తీసుకునేందుకు, ప్రభుత్వ భూముల రక్షణకు ఈ అధికారిక వ్యవస్థను పట్టాలు ఎక్కించడానికి రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుంది.
8.జనవరిలోనే దరఖాస్తులు స్వీకరించామని.. ఆదివారం రాత పరీక్ష నిర్వహించనున్నామని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మిగిలిన పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం