బల్దియా, హెచ్‌ఎండీఏ తరహాలో ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి కోసం.. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీని ముచ్చర్ల ప్రాంతంలో నిర్మించనున్నారు. ఇది శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉంటుంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి.. సిటీగా ఫ్యూచర్‌సిటీని డెవలప్చేయాలని నిర్ణయించి అథారిటీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన 8 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను ప్లాన్ ప్రకారం డెవలప్చేయనున్నారు. దీంతో ఏయే ప్రాంతాలు ఇందులో కలుస్తాయన్న అంశంపై అంతా ఆసక్తి నెలకొన్నది.
2.ఎఫ్‌సీడీఏ పరిధిలోకి ఇప్పటికే హెచ్ఎండీఏలోని 56 రెవెన్యూ గ్రామాలను కలపగా.. ఔటర్ రింగ్ రోడ్ అవతల, శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ స్టేట్ హైవేల పరిధిలోని పలు ప్రాంతాలను కూడా తీసుకువచ్చారు.
3.రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలోని శంషాబాద్, దాని పరిసర ప్రాంతాలు కూడా ఫ్యూచర్ సిటీలో వచ్చి చేరాయి. ఈ ప్రాంతంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ ఆధ్వర్యంలో ఎకనామిక్ జోన్, ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు.
4.ఈ అథారిటీ పరిధిలో కాంప్రహెన్సివల్ మాస్టర్ ప్లాన్ తో పాటు.. మల్టీమోడల్ కనెక్టివిటీ, మోడరన్ అర్బన్ ఎమినిటీస్ కల్పించనున్నారు. భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో రేడియల్‌రోడ్లు, మెట్రోరైల్ కనెక్టివిటీని కూడా కల్పించనున్నారు.
5.ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ అండ్ ఎడ్యుకేషన్ హబ్‌లతో కలిపి.. 12 జోన్లుగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
6.ఈ నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిని ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. హైదరాబాద్ నగరం విస్తరణ కూడా ఎక్కువగా అటువైపే ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
7.శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీలతో కలిసి మెట్రోరైలు విస్తరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
8.ఈ నగరం అభివృద్ధి చెందడంతో హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి.
సంబంధిత కథనం