Nirmal Utsav : సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసేలా.. నిర్మల్ ఉత్సవాలు.. 7 ప్రత్యేకతలు-7 special features of the nirmal utsav festival which will begin from january 5th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nirmal Utsav : సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసేలా.. నిర్మల్ ఉత్సవాలు.. 7 ప్రత్యేకతలు

Nirmal Utsav : సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసేలా.. నిర్మల్ ఉత్సవాలు.. 7 ప్రత్యేకతలు

Nirmal Utsav : నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసేలా.. నిర్మల్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో నుమాయిష్‌ను స్పూర్తిగా తీసుకొని.. నిర్మల్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన 7 ప్రత్యేకలు ఇలా ఉన్నాయి.

నిర్మల్ ఉత్సవాలు

నిర్మిల్ జిల్లాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. నాలుగు శతాబ్దాల కిందట ఏర్పడిన నిర్మల్‌ చుట్టూ అందమైన కోటలు.. బురుజులు, సహ్యాద్రి పర్వతాలు ఉన్నాయి. వాటి చుట్టూ గొలుసుకట్టు చెరువులు.. దట్టమైన అడవులతో కవ్వాల్‌ అభయారణ్యం, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, కొయ్య బొమ్మలు, నలువైపులా జలాశయాలు, గోండు వీరుల పోరాటం.. విభిన్న సంస్కృతి.. సంప్రదాయాలతో విరాజిల్లుతోంది.

ఇంతటి గొప్పదనం ఉన్న నిర్మల్‌‌ను మరింత వెలుగులోకి తీసుకరావడానికి కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. తొలిసారిగా నిర్మల్‌ ఉత్సవాల పేరిట వేడుకలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. వేడుకలకు ప్రముఖులను ఆహ్వానించారు.

7 ప్రత్యేకతలు..

1.చారిత్రక నేపథ్యం నిర్మల్‌‌లో తొలిసారిగా ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. నూతన సంవత్సరం ప్రారంభంలో ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి నిర్మల్‌ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

2.స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా.. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల తోపాటు వాణిజ్య సమూహాల నుంచి 36 స్టాళ్లు ఏర్పాటు చేశారు.

3.నిర్మల్ జిల్లా సంస్కృతిని చాటి చెప్పడంతోపాటు.. ఇక్కడి ఆహార పదార్థాలను ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు.

4.మూడు రోజుల పాటు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. చిన్నారులు ఆడుకునేలా ప్రత్యేకంగా ఆట వస్తువులు తెప్పించారు.

5.ఈ ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన ఏర్పాట్లు చేశారు.

6.గతంలో వరంగల్‌లో కాకతీయ ఉత్సవాలు, ఓరుగల్లు కళావైభవం, కాకతీయ సప్తాహం, నిజామాబాద్‌లో ఇందూరు ఉత్సవాలు, కరీంనగర్‌లో శాతవాహన కళోత్సవాలు నిర్వహించారు.

7.నిర్మల్ ఉత్సవాలకు జిల్లా ప్రజలు హాజరై తిలకించేలా విస్తృతంగా ప్రచారం చేపట్టారు. దీన్ని విజయవంతం చేసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్ ఈ వేడుకలపై ప్రత్యేక దృష్టిపెట్టారు.