1.ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఏపీ అసెంబ్లీలో వాట్సాప్ పాలనపై చర్చ జరగనుంది. వార్షిక బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025ను..శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి లోకేష్. పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లును.. శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి నారాయణ. 2024-25 ద్రవ్య వినిమయ అదనపు అంచనాలపై చర్చ, ఓటింగ్ ఉంటుంది. ఇవాళ ఏపీ అసెంబ్లీలో సభ్యులకు ఫొటో సెషన్ ఉంటుంది.
2.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సభ ముందుకు ఆరు బిల్లులు రానున్నాయి. నేడు సభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రి దామోదర ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్. నేడు సభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. రేపు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్.
3.ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు ప్రధాని మోదీతో భేటీకానున్నారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు.. ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు. చౌహాన్ కుమార్తె పెళ్లి వేడుకకు హాజరుకానున్నారు.
4.ఇవాళ మేదరమెట్లకు మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లనున్నారు. వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ భౌతికకాయానికి.. నివాళులర్పించనున్నారు మాజీ సీఎం జగన్.
5.ఇవాళ పోలీస్ కస్టడీకి వెళ్లనున్నారు నటుడు పోసాని కృష్ణమురళి. పోసానిని సీఐడీ ఒక రోజు విచారించనుంది. ఉదయం 10 నుంచి సా.5 గంటల వరకు విచారణ జరిగే అవకాశం ఉంది. గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని. ఇవాళ పోసాని బెయిల్ పిటిషన్‌పైనా విచారణ జరగనుంది.
6.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 25వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన ఏడుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. టీబీఎం భాగాలు, మట్టి తొలగింపు వేగవంతం అయ్యాయి. కాడవర్ డాగ్స్ బృందం గుర్తించిన.. డీ1, డీ2 దగ్గర తవ్వకాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది పాల్గొంటున్నారు. నేటి నుంచి రోబోలు రంగంలోకి దిగనున్నాయి.
7.తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. మార్చి రెండో వారంలోనే రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు.