National Family Health Survey : భర్తలు కొడితే పర్లేదట.. 83 శాతం తెలుగు మహిళలు-45 percent women and men justify beating wives according to national family health survey ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  45 Percent Women And Men Justify Beating Wives According To National Family Health Survey

National Family Health Survey : భర్తలు కొడితే పర్లేదట.. 83 శాతం తెలుగు మహిళలు

HT Telugu Desk HT Telugu
Jun 13, 2022 04:03 PM IST

భార్య మీదకు భర్త చేయి ఎత్తితే.. ఈ కాలంలో అంతేసంగతులు కదా. అయితే ఓ ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. దీనిపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో కాస్త ఇంట్రస్టింగ్ విషయం ఒకటి తెలిసింది. ప్రపంచ దేశాలు.. మహిళల రక్షణను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఇక్కడ తెలిసిన ఆసక్తికర విషయం ఏంటంటే.. మహిళలు మాత్రం కొన్ని సందర్భాల్లో గృహ హింస పర్వాలేదని చెబుతున్నారట. జాతీయ కుటుంబ సర్వేలో తెలిసిన విషయం ఇది.

ట్రెండింగ్ వార్తలు

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)–5లో చాలా విషయాలు తెలిశాయి. కొన్ని సందర్భాల్లో భర్తలు.. కొట్టడాన్ని.. చాలా మంది మహిళలు సమర్థిస్తున్నారట. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం.. 80 శాతానికిపైగా మహిళలు.. భర్తలు కొట్టడాన్ని తప్పుపట్టట్లేదట. భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం, భర్తతో వితండవాదం, నమ్మకద్రోహం, అత్తమామలను అగౌరవ పరచడం లాంటి సందర్భాల్లో భర్త అవసరమైతే భార్యపై చేయి చేసుకోవచ్చట. చెప్పింది ఎవరో కాదు... దేశ వ్యాప్తంగా 45.4 శాతం మంది మహిళలు. 44 శాతం మంది పురుషులు సర్వేలో చెప్పారు. అయితే అంతకుముందు సర్వేతో పోలిస్తే మహిళల్లో 7 శాతం తగ్గగా, పురుషుల్లో రెండు శాతం పెరిగింది.

కారణాలతో భార్యను కొట్టడాన్ని సమర్థించే మహిళల్లో తెలంగాణ 83.8 శాతం మంది ఉన్నారు. ఇదే అంశంలో ఏపీలో 83.6 శాతంగా ఉన్నారు. మెుదటి, రెండో ప్లేస్ మనదే. కర్ణాటకలో అత్యధికంగా పురుషులు 81.9 శాతం భార్యలపై చేయి చేసుకోవచ్చని సర్వేలో చెప్పారట. హిమాచల్‌ ప్రదేశ్, దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ అండ్‌ డయూలో తక్కువ మంది భార్యలు మాత్రమే భర్తలు కొట్టడాన్ని సమర్థిస్తున్నారు.

అయితే ఈ అభిప్రాయం మహిళల్లో వయసు పెరిగేకొద్ది.. పెరుగుతుందని సర్వేలో తేలింది. ఇదే పురుషుల్లో వయసు పెరిగేకొద్ది తగ్గుతుందట. భర్తలు దాదాపు 25 శాతం భార్యలను చెంప దెబ్బ కొడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెప్పింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా భర్యను కొట్టడంలో తప్పులేదనే అభిప్రాయం వస్తుందట.

అత్తమామలను సరిగా చూసుకోని సందర్భంలో భార్యను కొట్టొచ్చని 32 శాతం మహిళలు, 31 శాతం పురుషులు చెబుతున్నారని.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. ఇల్లు మరియు పిల్లలను నిర్లక్షం చేయడం కారణంగా కొడుతున్నారని.. 28 శాతం స్త్రీలు, 22 శాతం పురుషులు చెబుతున్నారు. భర్తతో వాదించడం కారణంగా కొట్టొచ్చని.. 22 శాతం మంది మహిళలు, 20 శాతం మంది పురుషులు నమ్ముతున్నారట. భార్య చెప్పకుండా బయటకు వెళ్లడం వంటి సాధారణ కారణాల వల్ల కూడా భార్యను కొడుతున్నారని సర్వేలో తేలింది.

 

గమనిక: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలోని విషయాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.

IPL_Entry_Point