Road accident: ఔరంగాబాద్‌లో రోడ్డు ప్రమాదం..సిద్ధిపేటకు చెందిన నలుగురు దుర్మరణం-4 telangana persons killed in road accident at aurangabad in maharastra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Road Accident: ఔరంగాబాద్‌లో రోడ్డు ప్రమాదం..సిద్ధిపేటకు చెందిన నలుగురు దుర్మరణం

Road accident: ఔరంగాబాద్‌లో రోడ్డు ప్రమాదం..సిద్ధిపేటకు చెందిన నలుగురు దుర్మరణం

Maheshwaram Mahendra Chary HT Telugu
May 24, 2023 11:31 AM IST

Road accident at Aurangabad: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు.

ఔరంగాబాద్‌లో రోడ్డు ప్రమాదం..
ఔరంగాబాద్‌లో రోడ్డు ప్రమాదం..

Aurangabad Road Accident Updates: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన నలుగురు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతులను అక్కన్నపేట మండలం చౌటపల్లివాసులు కృష్ణ, సంజీవ్‌, సురేశ్‌, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియల కోసం చౌటపల్లి వచ్చి సూరత్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అంత్యక్రియల కోసం వచ్చి......

వీరంతా సిద్ధిపేట జిల్లోని చౌపపల్లికి చెందినవారైనప్పటికీ బతుకుదెరువు కోసం సూరత్ లో ఉంటున్నారు. అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు పనులు చేస్తున్నారు. అయితే సొంత ఊర్లో బందువు చనిపోవటంతో అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. అయితే కుటుంబసభ్యులను చౌటపల్లిలోనే ఉంచి అన్నదమ్ములందరూ తిరిగి సూరత్‌కు మంగళవారం కారులో బయల్దేరారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న అన్నదమ్ములు నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకేసారి అన్నదమ్ములందరూ ప్రాణాలు కోల్పోవటంతో చౌటపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి.

హైదరాబాద్ లో ఐటీ సోదాలు…

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. బుధవారం ఉదయమే హైదరాబాద్‌ తో పాటు విశాఖపట్నంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. సుమారు 20 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పలు స్థిరాస్తి సంస్థలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఇందులో పలు ఫార్మా సంస్థలు ఉన్నట్లు సమాచారం.

టీ20 వరల్డ్ కప్ 2024