TG Govt Schemes : నేటి నుంచే 4 పథకాల అమలుకు శ్రీకారం - ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి-4 important schemes will be implemented in telangana from today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Schemes : నేటి నుంచే 4 పథకాల అమలుకు శ్రీకారం - ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి

TG Govt Schemes : నేటి నుంచే 4 పథకాల అమలుకు శ్రీకారం - ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి

రాష్ట్రంలో నాలుగు ముఖ్యమైన పథకాలు పట్టాలెక్కనున్నాయి. ఇవాళ రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పథకాలను ప్రభుత్వం లాంచనంగా ప్రారంభించబోతుంది. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఈ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం

ఇవాళ్టి నుంచే రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు స్కీమ్ లు లాంచనంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఈ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇవాళ 606 గ్రామాల్లో లాంఛనంగా ఈ నాలుగు స్కీంలకు శ్రీకారం చుట్టనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అమలు చేస్తారు. నారాయణపేట జిల్లాలోని చంద్రవంచలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని… ఈ స్కీమ్ లను ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లను సిద్ధం చేసింది.

4 పథకాలు - ముఖ్యమైన వివరాలు:

  1. తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నాలుగు పథకాలను ఆదివారం నుంచి పట్టాలెక్కించనుంది. ఇందులో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ఉన్నాయి.
  2. జనవరి 26వ తేదీన ఈ నాలుగు పథకాలను ప్రభుత్వం లాంచనంగా ప్రారంభించబోతుంది. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఈ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.
  3. లక్షల్లో దరఖాస్తులు రావటంతో పాటు కొత్తగా కూడా చాలా మంది దరఖాస్తు చేసుకోవటంతో ఒకేసారి లబ్ధిదారులను గుర్తించటం ఇబ్బందిగా మారుతుందని ప్రభుత్వం భావించింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
  4. ఈ నాలుగు పథకాలను ఇవాళ ప్రతి మండలంలోని ఒక గ్రామంలో నూరు శాతం అమలు చేయనుంది.
  5. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు నేటి నుంచి రైతు భరోసా అందజేయనుంది. ఎకరాకు రూ. 6వేల పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
  6. భూమిలేని నిరుపేదలకూ, ఉపాధి హామీ పథకంలో 20 రోజులపాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందజేయనున్నారు. ఈ స్కీమ్ కింద ఏడాకి రూ. 12వేలు ఇస్తారు.
  7. అర్హత ఉన్న వారిలో అసలైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ప్రారంభింస్తారు.
  8. ఎంపిక చేసిన గ్రామాలలో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు 4 పథకాలను అధికారికంగా ప్రారంభింస్తారు. మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగుతుంది.
  9. 4 నూతన పథకాల లాంచింగ్ లో అర్హులు మాత్రమే జాబితాలో ఉండేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు ఇచ్చారు.
  10. నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణం లో జరగాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రారంభ కార్యక్రమానికి ప్రతి గ్రామంలో మంచి ఆడియో వీడియో ఏర్పాట్లు చేయనున్నారు. ముందస్తుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని ప్రతి గ్రామంలో ప్రదర్శించాలని సీఏస్ ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత కథనం