TG EAP CET 2025: తెలంగాణ ఈఏపీ సెట్ 2025లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2.16 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈఏపీ సెట్ కన్వీనర్ ఈ ఏడాది దరఖాస్తుల్లో పూర్తి కులం వివరాలను సేకరిస్తారు. మూడు గ్రూపులు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయడనుండటంతో అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేస్తారు.
ఈఏపీ సెట్ 2025 దరఖాస్తులను రూ.250 ఆలస్య రుసుంతో బుధవారం వరకు స్వీకరించారు. ఇప్పటివరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2.16 లక్షల మంది దరఖాస్తు చేశారు. అగ్రికల్చర్-ఫార్మసీ విభాగానికి 84 వేల మంది దరఖాస్తు చేశారు. రెండు పరీక్షలకు కలిపి మూడు లక్షల దరఖాస్తులు అందాయి.
ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇంజినీరింగ్ విభాగంలో ఎస్సీ కులాలన్నింటికి కలిపి 25,300, అగ్రికల్చర్ విభాగంలో 21,200 దరఖాస్తులు వచ్చాయి. కులాల వారీగా మాదిగ విభాగంలో ఇంజినీరింగు 13,287(52%), అగ్రికల్చర్‌కు 12,763(60%)້ మంది విద్యార్థులు దరఖాస్తుచేశారు.
తెలంగాణ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీతో గడువు పూర్తి కాగా... మరోవైపు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. రూ.5 వేలతో ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఏప్రిల్ 14 వరకు రూ. 500 ఆలస్య రుసుము నిర్ణయించారు. ఇక ఏప్రిల్ 18 వరకు రూ. 2500 ఫైన్, ఏప్రిల్ 24 వరకు రూ. 5 వేల ఆలస్య రుసుము చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
తెలంగాణ ఈఏపీసెట్ హాల్ టికెట్లు ఏప్రిల్ 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తారు.
గత ఏడాది ఇంజినీరింగ్‌కు 2,54,750 మంది దరఖాస్తు చేయగా 2,40,617 మంది పరీక్ష రాశారు. ఈసారి ఏపీ విద్యార్థులకు అవకాశం లేకపోవటంతో అప్లికేషన్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సంబంధిత కథనం