Road Accident in Nalgonda: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం-3 dead in road accident at kattamgur in nalgonda district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  3 Dead In Road Accident At Kattamgur In Nalgonda District

Road Accident in Nalgonda: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం

HT Telugu Desk HT Telugu
Jan 08, 2023 09:11 AM IST

road accident at kattamgur: నల్గొండ జిల్లా కట్టంగూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు డివైడర్ ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం

Road accident in Nalgonda District: నల్లగొండ జిల్లా కట్టంగూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యరసానిగూడెం వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని ఇద్దాక్‌(21), సమీర్‌(21), యాసిన్‌(18)గా గుర్తించారు. వీరంతా కూడా ఇన్నోవా కారులో ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. అక్కడి ఫంక్షన్ చూసుకున్న తర్వాత తిరిగి ఖమ్మం వస్తుండగా.. ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా ఖమ్మంలోని భాగ్ ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Construction building collapsed in Hyderabad: హైదరాబాద్ కూకట్ పల్లిలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శాంతినగర్ లో నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తు శ్లాబ్‌ ఒక్కసారిగా పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద పడి ఇద్దరు కూలీలు మరణించారు. ఉత్తర్ ప్రదేశ్‌కు దయ, ఆనంద్‌లను మృతులుగా గుర్తించారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భవనంలోని 4వ, 5వ అంతస్తులో పనులు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు... వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఫైర్ ,రెస్క్యూ టీం,స్థానిక పోలీసులు శిథిలాలను తొలగించారు. ఐదు గంటలకు పైగా సహాయక చర్యలు కొనసాగాయి. పనుల్లో నాణ్యతాలోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. భవనం మరికొంత భాగం కూడా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

IPL_Entry_Point