South Central Railway : అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త.. శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలు ఇవే-26 special trains to sabarimala under the auspices of south central railway ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  South Central Railway : అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త.. శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలు ఇవే

South Central Railway : అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త.. శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలు ఇవే

Basani Shiva Kumar HT Telugu
Nov 19, 2024 06:21 PM IST

South Central Railway : శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో భక్తుల రద్దీకి తగ్గట్టు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తాజాగా.. 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ.. మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

నవంబర్‌ 25, డిసెంబర్‌ 2, 9, 16 తేదీల్లో మచిలీపట్నం - కొల్లాం మధ్య (రైలు నంబర్ 07145), నవంబర్‌ 20, 27, డిసెంబర్‌ 4, 11, 18 మధ్య కొల్లాం-మచిలీపట్నం (రైలు నంబర్ 07146) మొత్తం 10 సర్వీసులు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వివరించింది.

ఈ రైళ్లే కాకుండా 23, 30 తేదీల్లో మచిలీపట్నం- కొల్లాం (రైలు నంబర్ 07147), తిరుగు ప్రయాణంలో నవంబర్‌ 25, డిసెంబర్‌ 1 తేదీల్లో మరో 2 రైళ్లను (రైలు నంబర్ 07148) నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మౌలాలి - కొల్లాం మధ్య (రైలు నంబర్ 07143) నవంబర్‌ 22, 29, 6, 13, 20, 27 తేదీల్లో.. కొల్లాం - మౌలాలి మధ్య (రైలు నంబర్ 07144) నవంబర్‌ 24, డిసెంబర్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో మొత్తం 12 సర్వీసులు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మౌలాలి నుంచి బయల్దేరే రైలు తెలుగు రాష్ట్రాల్లో.. చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట జంక్షన్లలో అగుతుంది.

మచిలీపట్నం నుంచి బయల్దేరే ట్రైన్ ఏపీలోని.. పెడన, గుడివాడ, విజయవాడ, కృష్ణా కెనాల్, న్యూ గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట జంక్షన్లలో అగుతుంది.

మచిలీపట్నం నుంచి బయల్దేరే మరో రైలు.. పెడన, గుడివాడ జంక్షన్, విజయవాడ, గుంటూరు జంక్షన్, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్డు, కుంభం, గిద్దలూరు, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట జంక్షన్లలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు.

Whats_app_banner