రాష్ట్రంలో పని చేస్తున్న పలువురు ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. మొత్తం 21 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో అడిషనల్ డీజీతో పాటు ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డిఐజీలు ఉన్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా గౌస్ ఆలం నియమితులయ్యారు. వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్, సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్,నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య, రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా(ప్రస్తుతం వరంగల్ సీపీ)ను బదిలీ చేశారు.
సీఐడీ ఐజీగా ఎం.శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధుశర్మ నియమితులయ్యారు. ఇక కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, రాజన్న సిరిసిల్ల ఎస్పీగా జీఎం బాబా సాహెబ్ బదిలీ అయ్యారు. వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్, మంచిర్యాల డీసీపీగా ఎ.భాస్కర్, సూర్యాపేట ఎస్పీగా కె.నర్సింహ బాధ్యతలు చూడనున్నారు.ఇక హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్, సీఐడీ ఎస్పీగా రవీందర్, నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్ నియమితులయ్యారు.
గత ఫిబ్రవరి నెలలోనూ పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందులో మొత్తం ఎనిమిది మంది అధికారులు ఉన్నారు. హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్ నియమితులయ్యారు. ఇక సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజారావు భూపాల్ బాధ్యతలు చూస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా చైతన్యకుమార్ బదిలీ అయిన సంగతి తెలిసిందే.