Bank Holidays In March: మార్చిలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు.. బ్యాంకులు పని చేయని తేదీలు ఇవే…
Bank Holidays In March: మార్చి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులుఉన్నాయి. పండుగలు, రెండు, నాలుగో శని, ఆదివారాల కారణంగా బ్యాంకు బ్రాంచీలలో లావాదేవీలు ఉండవు.
Bank Holidays In March: మార్చి నెలలో పండుగలు, రెండు/ నాలుగో శని, ఆదివారాల కారణంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లో రెండు/నాలుగో శనివారాలు, ఆదివారాలు బ్యాంకు శాఖల్లో ఎలాంటి లావాదేవీలను నిర్వహించరు. పండుగలలో సెలవులు మాత్రం రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంటాయి.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా బ్యాంకులకు సెలవుల్ని నిర్ణయిస్తారు. బ్యాంకు సెలవు దినాల్లో కూడా కస్టమర్లు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఆర్‌బిఐ జాబితా ప్రకారం మార్చి నెలలో 14 రోజుల పాటు సెలవు రోజులుగా గుర్తించారు.
మార్చి 2024 మార్చి
1 (శుక్రవారం): చాప్చర్ కుట్ (ఐజ్వాల్)
మార్చి 3: ఆదివారం
మార్చి 8 (శుక్రవారం): మహాశివరాత్రి (మహా వద్-13)/శివరాత్రి (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్పూర్, రాయ్పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం)
మార్చి 9: రెండో శనివారం
మార్చి 10: ఆదివారం
మార్చి 17: ఆదివారం
మార్చి 22 (శుక్రవారం): బీహార్ దివస్ (పాట్నా)
మార్చి 23: నాలుగో శనివారం
మార్చి 24: ఆదివారం
మార్చి 25 (సోమవారం): హోలీ (రెండో రోజు) - ధూలేటి / డోల్ జాత్రా / ధులెండి (బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ఇంఫాల్, కొచ్చి, కోహిమా, పాట్నా, శ్రీనగర్ మరియు తిరువనంతపురం మినహా)
మార్చి 26 (మంగళవారం): యాసాంగ్ రెండవ రోజు / హోలీ (భువనేశ్వర్, ఇంఫాల్) మరియు పాట్నా)
మార్చి 27 (బుధవారం): హోలీ (పాట్నా)
మార్చి 29: గుడ్ ఫ్రైడే (అగర్తలా, గౌహతి, జైపూర్, జమ్మూ, సిమ్లా మరియు శ్రీనగర్ మినహా)
మార్చి 31: ఆదివారం