TGSRTC: 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 ఎక్కితే ఎలా.. నడి రోడ్డుపై బస్సును ఆపేసిన డ్రైవర్-110 people boarded the tgsrtc bus where 50 people were supposed to board ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc: 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 ఎక్కితే ఎలా.. నడి రోడ్డుపై బస్సును ఆపేసిన డ్రైవర్

TGSRTC: 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 ఎక్కితే ఎలా.. నడి రోడ్డుపై బస్సును ఆపేసిన డ్రైవర్

Basani Shiva Kumar HT Telugu
Aug 22, 2024 03:32 PM IST

TGSRTC: తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఎక్కే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ.. రద్దీకి తగ్గట్టు బస్సులు మాత్రం ఉండటం లేదు. ఇటీవల జరిగిన ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయి. తాజాగా సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు 55 మంది ఎక్కాల్సి ఉండగా.. ఏకంగా 110 మంది ఎక్కారు.

55 మంది ఎక్కాల్సిన బస్సులో 110
55 మంది ఎక్కాల్సిన బస్సులో 110

తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి రోజుకో ఘటన వెలుగులోకి వస్తోంది. ఇటీవల నిర్మల్ డిపోకు చెందిన బస్.. జగిత్యాల నుంచి వెళుతుండగా మొరపెల్లి వద్ద ప్రమాదం జరిగింది. 50 మంది ఎక్కాల్సిన ఆ బస్సులో 170 మంది ఎక్కారు. ఒవర్ లోడ్ కారణంగా బస్సు వెనకాల రెండు టైర్లు ఊడిపోయాయి. తాజాగా.. 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 ఎక్కారు. ఇంత మంది ఎక్కితే ఎలా అని డ్రైవర్ బస్సును రోడ్డు పైనే ఆపేశారు. ఈ ఘటన హుజురాబాద్ సమీపంలో జరిగింది.

ఏకంగా 110 మంది ఎక్కారు..

సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హుజురాబాద్ నుంచి వరంగల్ వెళ్తోంది. ఈ బస్సు కెపాసిటీ 55 మంది. కానీ.. ఏకంగా 110 మంది ప్రయాణికులు ఎక్కారు. దీంతో ఇంత మంది ఎక్కితే ఎలా అని.. నడి రోడ్డుపైనే ఆర్టీసి బస్సును ఆశారు డ్రైవర్. సైడ్ వ్యూ మిర్రర్ కూడా కనబడట్లేదని.. ఇలా అయితే బస్సు ఎలా నడపాలని డ్రైవర్ అసహనం వ్యక్తం చేశారు. కొంత మంది ప్రయాణికులు దిగాలని బస్సు ఆపేశారు. ఓవర్ లోడ్ కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే.. మళ్లీ డ్రైవర్లనే అంటారు కదా అని అన్నారు.

ర్దదీ ఎక్కువ.. సర్వీసులు తక్కువ..

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఎక్కేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ.. రద్దీకి తగ్గట్టు సర్వీసులు మాత్రం ఉంటడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. సరిపడా సర్వీసులు లేని కారణంగా ఎక్కువ మంది ఒకే బస్సులో ఎక్కుతున్నారని చెబుతున్నారు. రద్దీ ఉన్న రూట్లలో బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల సంఖ్య పెంచితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

రన్నింగ్‌లో ఉండగానే..

ఇటీవల బస్సు రన్నింగ్‌లో ఉండగానే పార్టులు ఊడిపోయి రోడ్డుపై పడ్డాయి. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. TS 31 Z 0054 బస్సు రన్నింగ్‌లో ఉండగా బస్సు పార్టులు ఊడిపోయి రోడ్డుపైన పడ్డాయి. పెద్ద శబ్దం రావడంతో.. బస్సులో ఉన్న ప్రయాణికులు, రోడ్డుపై ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కింద పడిపోయిన పార్టులను బస్ డ్రైవర్, కండక్టర్ తీసుకొని మళ్లీ ప్రయాణం మొదలు పెట్టారు.