Vajedu SI Suicide Case : వాజేడు ఎస్సై ఆత్మహత్య.. సోషల్ మీడియా నుంచి సూసైడ్ వరకు.. 11 ముఖ్యమైన అంశాలు
Vajedu SI Suicide Case : ములుగు జిల్లాలో వాజేడు ఎస్సై సూసైడ్ ఘటన సంచలనంగా మారింది. ఈ ఇష్యూలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి సూసైడ్ వరకు జరిగిన పరిణాలపై ఆరా తీస్తున్నారు.
ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్య ఘటన.. తెలంగాణలో సంచలనంగా మారింది. పోలీస్ శాఖకు చెందిన యువ అధికారి సూసైడ్ చేసుకోవడంతో.. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. హరీష్ ఆత్మహత్యకు గల కారణాలపై లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి 11 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
1.ఏడు నెలల కిందట ఎస్సై హరీష్‌కు ఒక కాల్ వచ్చింది. ఫలానా వ్యక్తేనా అంటూ ఆ యువతి ఆరా తీయడంతో.. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి.
2.ఆ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. దాన్ని ఎస్సై హరీష్ కూడా యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి ఛాటింగ్ చేసుకునేవారు.
3.ఆ యువతి హైదరాబాద్‌లో ఉండేది. వీకెండ్ సెలవుల్లో వాజేడుకు వచ్చేది. రెండు రోజులు ఉండి వెళ్లేది. దీంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
4.పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. ఆమె గురించి ఎస్సై హరీష్ ఆరా తీశారు. ఈ క్రమంలో కొన్ని విషయాలు తెలిశాయి.
5.సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన ఆ యువతి.. ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేదని.. ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందనే విషయం హరీష్‌కు తెలిసింది.
6.ఈ విషయాలు తెలియడంతో.. ఎస్సై హరీష్ ఆ యువతి పెళ్లి ప్రతిపాదనను నిరాకరించారు. తన ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం చేసుకునేందుకు రెడీ అయ్యాడు. త్వరలోనే నిశ్చితార్థం జరగాల్సి ఉంది.
7.పెళ్లిక నిరాకరించిన విషయం ఆమెకు చెప్పడంతో.. దీనిపై మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్లకట్ట సమీపంలోని రిసార్టుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
8.పెళ్లి గురించి మాట్లాడుకునే క్రమంలో.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
9.ఆ యువతితో సెటిల్‌మెంట్ చేసుకోవడానికి ఎస్సై హరీష్ ప్రయత్నించారని.. ఇందుకు యువతి ఒప్పుకోలేదు.
10.ఈ విషయాన్ని పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులకు చెబుతానని యువతి బెదిరించడంతో.. ఎస్సై హరీష్ మనస్తానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
11.తమ కుమారుడు హరీష్ మృతికి ఆ యువతే కారణమని ఎస్సై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.