TS 108 Staff: పసిబిడ్డకు సీపీఆర్‌తో ప్రాణం పోసిన 108 సిబ్బంది
TS 108 Staff: ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసిబిడ్డకు 108 సిబ్బంది సిపిఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టిన ఘటన మేడ్చల్‌లో జిల్లాలో జరిగింది.
TS 108 Staff: మేడ్చల్లో అప్పుడే పుట్టిన పసికెందుకు 108 సిబ్బంది ప్రాణం పోశారు. మేడ్చల్ జిల్లా కీసర ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఉదయం పండంటి బిడ్డకు దుర్గ అనే మహిళా జన్మనిచ్చింది.ఆమెకు నార్మల్ డెలివరీ కాగా పుట్టిన బిడ్డకు ఎలాంటి చలనం లేకపోవడంతో దుర్గా దంపతులు తల్లడిల్లి పోయ్యారు.
వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బిడ్డకు హార్ట్ బీట్ సరిగా లేదని చెప్పి..వెంటనే గాంధీ ఆస్పత్రి తరలించాలని సూచించారు.దీంతో ఎలాగైనా తమ బిడ్డని బతికించాలని కాళ్ల వెళ్ళ పడి ఆ దంపతులు వైద్యులను బతిలాడుకున్నారు.
బిడ్డను చికిత్స కోసం హుటాహుటిన అంబులెన్సు లో గాంధీ ఆస్పత్రికి తరలిస్తూ ఉండగా 108 సిబ్బంది బిడ్డకు CPR చేశారు. దాంతో ఒక్కసారే పాపలో చలనం వచ్చింది. తమ బిడ్డకు 108 సిబ్బంది పునర్జన్మ ప్రసాదించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.కీసర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు 108 సిబ్బందిని అభినందించారు.
భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య…
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఆకస్మాత్తుగా రక్తపోటు ఎక్కువై భర్త హఠాన్మరణం పాలవడాన్ని తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త హఠాన్మరణంతో తీవ్రంగా కృంగిపోయి చివరికి తన ఉసిరి తీసుకుంది.
మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాలు ప్రకారం.......రహింపురాకు చెందిన కుమార్ సింగ్ ( 36) అప్పర్ దూల్ పెట్ అలంకరి కాలనీకి చెందిన అస్మిత ( 31) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గచ్చిబౌలిలో ప్రైవేటు ఉద్యోగం చేసే అవాన్ కుమార్ సింగ్ గత నెల 26న రాత్రి ఒక్కసారిగా బీపీ ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు .అప్పటి నుంచి భార్య అస్మిత మానసిక వేదన అనుభవిస్తుంది. భర్త ఫోటో దగ్గర పెట్టుకొని బాధపడుతునే ఉంటోంది.
చివరికి తీవ్ర మనస్థాపం తో అలంకారి కాలనీలో పుట్టింట్లో అస్మిత చున్నీతో ఉరేసుకున్న ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలం చేరుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)