Hyderabad RRR : తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాట.. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు.. 10 ప్రత్యేకతలు-10 special features regarding the construction of hyderabad regional ring road ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rrr : తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాట.. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు.. 10 ప్రత్యేకతలు

Hyderabad RRR : తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాట.. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు.. 10 ప్రత్యేకతలు

Basani Shiva Kumar HT Telugu
Dec 29, 2024 12:10 PM IST

Hyderabad RRR : హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డులు కీలక పాత్ర పోషించాయి. తాజాగా తెలంగాణ అభివృద్ధికి రిజనల్ రింగ్ రోడ్డుతో బంగారు బాట వేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది ఒక గేమ్ ఛేంజర్‌గా మారబోతోందనే అంచనాలు ఉన్నాయి.

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు

హైదరాబాద్‌ నగరం చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. 5 ప్యాకేజీలుగా హైదరాబాద్ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. దీనికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు పిలిచింది. ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్‌గా మారబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం.

yearly horoscope entry point

1. విస్తృతమైన కనెక్టివిటీ:

రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌ చుట్టూ ఉంటుంది. నగరాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో, పొరుగు రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. ఇది వస్తు, ఇతర సేవలను వేగవంతం చేస్తుంది. ఆర్థిక వృద్ధిని గణనీయంగా ప్రోత్సహిస్తుంది.

2. కొత్త అభివృద్ధి కేంద్రాలు:

రీజనల్ రింగ్ రోడ్డు మార్గంలోని పలు ప్రాంతాలు కొత్త అభివృద్ధి కేంద్రాలుగా మారతాయి. ఇక్కడ పారిశ్రామిక, వాణిజ్య, నివాస ప్రాజెక్టులు వస్తాయి. ఇది ఉపాధి అవకాశాలను పెంచుతుంది.

3. ట్రాఫిక్‌ తగ్గుదల:

రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇంధన వ్యయం తగ్గుతుంది.

4. వ్యవసాయానికి ప్రోత్సాహం:

రీజనల్ రింగ్ రోడ్డు మార్గంలోని గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెట్‌కు చేరుకోవడం సులభం కావడంతో.. రైతుల ఆదాయం పెరుగుతుంది.

5. పర్యావరణం:

రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పర్యావరణాన్ని కాపాడే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఉదాహరణకు.. చెట్లను నాటడం, వర్షపు నీటిని నిల్వ చేయడం వంటివి చేపట్టనున్నారు.

6. సామాజిక అభివృద్ధి:

రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ప్రాంతీయ అభివృద్ధికి బాటలు పడతాయి. ఆరోగ్యం, విద్య వంటి సామాజిక సేవలు మరింత మెరుగుపడతాయి. ఫలితంగా ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది.

7. సులభమైన ప్రయాణం:

రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

8. పారిశ్రామిక అభివృద్ధి:

రీజనల్ రింగ్ రోడ్డు మార్గంలో పారిశ్రామిక కారిడార్‌లు అభివృద్ధి చెందనున్నాయి. ఇది పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇప్పటికే పలు కంపెనీలను స్థాపించారు.

9. భూ విలువ పెరుగుదల:

రీజనల్ రింగ్ రోడ్డు మార్గంలోని భూమి విలువ భారీగా పెరుగుతుంది. ఇది స్థానిక ప్రజల ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది. అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

10. రాష్ట్రానికి గర్వకారణం:

రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా నిలవనుంది. ఇది రాష్ట్రం అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల నుంచి దాదాపు 50 కిలోమీటర్ల వరకు అదే స్థాయిలో అభివృద్ధి జరగనుంది.

టెండర్ వివరాలు..

1వ ప్యాకేజీ:

గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారి. రూ.1529.19 కోట్లతో రెండు సంవత్సరాల్లో నిర్మించనున్నారు. 5 సంవత్సరాల మొయింటెనెన్స్ ఉంటుంది.

2వ ప్యాకేజీ:

రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు వరకు 26 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారి. రూ.1114.80 కోట్లతో రెండు సంవత్సరాల్లో నిర్మించనున్నారు. 5 సంవత్సరాల మొయింటెనెన్స్ ఉంటుంది.

3వ ప్యాకేజీ:

ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు వరకు 23 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారి. రూ.1184.81 కోట్లతో రెండు సంవత్సరాల్లో నిర్మిస్తారు. 5 సంవత్సరాల మొయింటెనెన్స్ ఉంటుంది.

4వ ప్యాకేజీ:

ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి గ్రామం వరకు వరకు 43 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారి. రూ.1728.22 కోట్లతో రెండు సంవత్సరాల్లో నిర్మించనున్నారు. 5 సంవత్సరాల మొయింటెనెన్స్ ఉంటుంది.

5వ ప్యాకేజీ:

రాయగిరి గ్రామం నుంచి తంగడ్‌పల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారి. రూ.1547.04 కోట్లతో రెండు సంవత్సరాల్లో నిర్మిస్తారు. 5 సంవత్సరాల మొయింటెనెన్స్ ఉంటుంది.

5 ప్యాకేజీలుగా నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పొడవు 161.518 కిలోమీటర్లు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.7,104.06 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.

Whats_app_banner