Hyderabad : హైదరాబాద్ నగరంలో ఏసీల వినియోగం ఎందుకు పెరుగుతోంది.. ఇవిగో 10 కారణాలు!
Hyderabad : హైదరాబాద్ నగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. దీంతో విద్యుత్ వినియోగం ఊహించని స్థాయిలో ఉంది. విద్యుత్ వినియోగం పెరగడంపై ఇటీవల చర్చ జరిగింది. ఈ సమయంలో ఆసక్తికరమైన విషయం తెలిసింది. నగరంలో ఏసీల వినియోగం భారీగా ఉందని.. అందుకే విద్యుత్ వినియోగం పెరుగుతోందని నిపుణలు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో ఉష్టోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. ముఖ్యంగా ఏసీల వినియోగం బాగా పెరిగిందని విద్యుత్ శాఖ అధికారి ఒకరు చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఏసీల వినియోగం భారీగా పెరగడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.
1.పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు హైదరాబాద్‌లో కూడా కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. దీంతో చల్లదనం కోసం ఏసీలను వాడడం తప్పనిసరి అవుతుంది.
2.జనాభా పెరుగుదల..
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో ఇక్కడికి వలస వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీల వాడకం కూడా పెరుగుతోంది.
3.జీవనశైలి మార్పులు..
ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. దీని వల్ల ఏసీ వంటి సౌకర్యాలను ఎక్కువగా వాడుతున్నారు.
4.ఆర్థిక స్థోమత..
హైదరాబాద్ నగరంలో మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంది. వారికి ఏసీలను కొనుగోలు చేసే స్థోమత పెరిగింది. సౌకర్యవంతంగా ఉండేందుకు ఎక్కువగా ఏసీలను కొనుగోలు చేస్తున్నారు.
5.కార్యాలయాల పెరుగుదల..
హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మాస్యూటికల్స్ వంటి పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. ఆయా రంగాల్లో అనేక కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఈ కార్యాలయాల్లో ఏసీలు తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
6.నిర్మాణాల్లో మార్పులు..
కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లు, ఇళ్లలో ఏసీలను అమర్చేందుకు అనుకూలంగా డిజైన్లు ఉంటున్నాయి. ఈ కారణంగా కూడా ఏసీల కొనుగోళ్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
7.కాలుష్యం పెరుగుదల..
హైదరాబాద్ మహా నగరంలో విపరీతంగా వాహనాలు పెరిగిపోతున్నాయి. అదే స్థాయిలో గాలి కూడా కాలుష్యమవుతోంది. దీంతో ప్రజలు ఇంట్లో చల్లగా ఉండడానికి ఏసీలను ఉపయోగిస్తున్నారు.
8.సరఫరా పెరుగుదల..
హైదరాబాద్ నగరంలో నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉంటోంది. విద్యుత్ స్థిరత్వం కారణంగా కూడా ప్రజలు ఏసీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
9.ఏసీల ధరలు తగ్గడం..
ప్రస్తుతం ఏసీ కంపెనీల్లో పోటీ పెరిగింది. దీంతో సేల్స్ పెంచుకునేందుకు వివిధ కంపెనీలు పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఫలితంగా ఏసీల ధరలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రజలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
10.ఆరోగ్య కారణాలు..
వేసవి కాలంలో వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో బాధపడేవారు ఎక్కువ వేడిని తట్టుకోలేరు. కాబట్టి వారు ఏసీలను తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవే కాకుండా ఇంకా అనేక కారణాలతో భాగ్యనగరంలో ఏసీల వాడకం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.