SCR Additional Stoppages : ప్రయాణికులకు గుడ్ న్యూస్ ... ఏపీ, తెలంగాణలో ఈ రైళ్లకు అదనపు హాల్టులు - లిస్ట్ ఇదే
Trains Additional Stoppages in AP Telangana: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది భారతీయ రైల్వే శాఖ. ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే పలు రైళ్లకు కొత్త స్టేజీల్లో నిలుపుదలను వెల్లడించింది.
Trains Additional Stoppages in Telugu States : తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లకు 18 కొత్త స్టాపేజీలను ప్రకటించింది. ఫలితంగా ఆయా స్టేషన్లలో మరికొన్ని రైళ్లు ఆగనున్నాయి. ఇందులో తెలంగాణలోని 10 స్టేషన్లలో(Trains Additional Stoppages in Telangana) పలు రైళ్లు ఆగనుండగా… మిగతావి ఏపీలో(Trains Additional Stoppages in AP) ఆగుతాయి. ఇందుకు సంబంధించిన స్టాపేజీలకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. ఈ సేవలు ప్రారంభమయ్యే తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
రైళ్ల వివరాలు - కొత్త స్టాపేజీలు
- రామేశ్వరం - భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ - రాజమండ్రి రైల్వే స్టేషన్.
- హౌరా - పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ - రాజమండ్రి స్టేషన్.
- హుబ్లీ - మైసూర్ - హంపి ఎక్స్ ప్రెస్ - అనంతపురం స్టేషన్.
- సికింద్రాబాద్ రేపల్లె ఎక్స్ ప్రెస్ - సిరిపురం.
- కాజీపేట -బలార్ష ఎక్స్ ప్రెస్ - రాఘవపురం.
- కాజీపేట - బలార్ష ఎక్స్ ప్రెస్ - మందమర్రి స్టేషన్.
- పూణె - కాజీపేట ఎక్స్ ప్రెస్ - మంచిర్యాల.
- దౌండ్ - నిజామాబాద్ ఎక్స్ ప్రెస్ - నవీపేట్.
- తిరుపతి - ఆదిలాబాద్ - కృష్ణా ఎక్స్ ప్రెస్ - మేడ్చల్ స్టేషన్.
- భద్రాచలం - సింగరేణి ఎక్స్ ప్రెస్ - బేతంపూడి స్టేషన్.
- నర్సాపూర్ - నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ - మహబూబాబాద్ స్టేషన్.
- సికింద్రాబాద్ - తిరుపతి - వందేభారత్ ఎక్స్ ప్రెస్ - మిర్యాలగూడ స్టేషన్.
- సికింద్రాబాద్ - భద్రాచలం - కాకతీయ ఎక్స్ ప్రెస్ - తడకలపుడి.
- రేపల్లె - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ - రామన్నపేట.
- గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ - ఉంద నగర్.
- కాజీపేట్ - బలార్ష ఎక్స్ ప్రెస్ - Rechni Road, తాండూరు.
- తిరుపతి - సికింద్రాబాద్ - పద్మావతి ఎక్స్ ప్రెస్ - నెక్కొండ స్టేషన్.
- భద్రాచలం రోడ్డు - సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ ప్రెస్ - బేతంపుడి.
తెలంగాణలో రైల్వే ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పించేందుకు పది రైళ్లకు సంబంధించిన కొత్త స్టాప్‌లకు రైల్వేశాఖ ఆమోదం తెలపడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను చేసిన విజ్ఞప్తికి స్పందించి కొత్త స్టాప్ లకు ఆమోదం తెలిపినందకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.