Chahal Divorce: భరణం రూ.60 కోట్లు.. చాహల్-ధనశ్రీ సెటిల్మెంట్.. విడాకులు పక్కానా!
Chahal Divorce: టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల రూమర్లు కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీళ్లిద్దరి మధ్య సెటిల్మెంట్ జరిగిందని, ధనశ్రీకి భరణంగా చాహల్ రూ.60 కోట్లు ఇవ్వబోతున్నాడనే వార్తలొస్తున్నాయి.

అటు టీమ్ఇండియాలో చోటు కోల్పోయిన సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇటు పర్సనల్ లైఫ్ లోనూ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. భార్య ధనశ్రీ వర్మ కు అతను విడాకులు ఇవ్వబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ భార్యభర్తల మధ్య డివోర్స్ సెటిల్మెంట్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్లు చెల్లించేందుకు చాహల్ సిద్ధమయ్యాడని తెలిసింది.
ఇన్ స్టాలో అన్ ఫాలో
గతంలోనూ చాహల్, ధనశ్రీ విడిపోతున్నారనే ఊహాగానాలు రాగా, వీళ్లిద్దరూ ఖండించారు. కానీ ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో ఒకరి అకౌంట్ ను మరొకరు అన్ ఫాలో చేసుకోవడంతో మరోసారి డివోర్స్ రూమర్స్ ఊపందుకున్నాయి. ధనశ్రీ అకౌంట్ ను అన్ ఫాలో చేసిన చాహల్.. ఆమె ఫొటోలను కూడా డిలీట్ చేశాడు. ధనశ్రీ మాత్రం ఫొటోలను అలాగే ఉంచింది.
రూ.60 కోట్లు
కొంతకాలంగా వస్తున్న విడాకుల వార్తలపై చాహల్-ధనశ్రీ స్పందిస్తూ తమ ప్రైవసీని గౌరవించాలని కోరారు. విడాకులు తీసుకోవచ్చు,లేకపోవచ్చు అని చాహల్ గతంలో తెలిపాడు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు విడిపోయేందుకు నిర్ణయించుకున్నారనే వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భరణంగా చాహల్ రూ.60 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది.
కొరియోగ్రాఫర్
డెంటిస్ట్ అయిన ధనశ్రీ వర్మ కొరియోగ్రాఫర్ కూడా. యూట్యూబ్ లో తన డ్యాన్స్ లతో ఆమె పాపులర్ అయ్యారు. ఓ హిందీ రియాలిటీ డ్యాన్స్ షో లోనూ పార్టిసిపేట్ చేశారు. శ్రేయస్ అయ్యర్ తదితర టీమ్ఇండియా క్రికెటర్లతో ధనశ్రీ డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. చాహల్, ధనశ్రీ 2020లో పెళ్లి చేసుకున్నారు.
సంబంధిత కథనం