WTC Final IND Vs AUS : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మిగిలింది మరో మూడు రోజులే-wtc final 2023 ind vs aus icc world test championship final is just three days asway ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final Ind Vs Aus : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మిగిలింది మరో మూడు రోజులే

WTC Final IND Vs AUS : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మిగిలింది మరో మూడు రోజులే

HT Telugu Desk HT Telugu
Jun 04, 2023 10:18 AM IST

IND vs AUS, WTC Final : మరికొన్ని రోజుల్లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ జరగనుంది. టీమ్ ఇండియా విజయం సాధిస్తే, క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మరే జట్టు చేయలేని అరుదైన రికార్డును లిఖిస్తుంది.

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ICC టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final 2023) కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ముఖ్యమైన మ్యాచ్ జూన్ 7 నుండి 11 వరకు జరుగుతుంది. ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌ జరుగుతుంది. టీమిండియా ఆటగాళ్లందరూ లండన్‌లోని అరండేల్ క్యాజిల్ క్రికెట్ క్లబ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు.

విశేషమేమిటంటే.. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంటే టీమిండియా క్రికెట్ చరిత్రలో మరే జట్టు చేయలేని అరుదైన రికార్డును లిఖిస్తుంది. ఆసీస్‌పై భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిస్తే వన్డే, టీ20, టెస్టు మూడు ఫార్మాట్లలో ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కుతుంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఐదు రోజుల పాటు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ టెస్ట్ డ్రాగా ముగిస్తే.. WTC 2021-23 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియన్ జట్టుకు టైటిల్‌ వెళ్లదు. ICC నిబంధనల ప్రకారం, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ డ్రాగా ముగిస్తే, రెండు జట్లను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.

ఒకవేళ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగితే, గత సంవత్సరం ఎడిషన్ లాగా రిజర్వ్ డే ఉంటుంది. అయితే దీనికి కూడా ఒక నియమం ఉంది. ఒక్కో టెస్టు ఆడే సమయం 30 గంటలు. అంటే రోజుకు ఆరు గంటలు లేదా రోజుకు 90 ఓవర్లు. నిర్దేశించిన ఆరు గంటలు చేరుకోకపోతే లేదా రోజుకు 90 ఓవర్ల పూర్తి కోటాను పూర్తి చేయకపోతే మాత్రమే రిజర్వ్ డే అమల్లోకి వస్తుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ స్టార్ స్పోర్ట్స్ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ అప్లికేషన్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.

టీమ్ ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ మరియు జయదేవ్ ఉనద్కత్. రిజర్వ్‌ : సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్

ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, మాథ్యూ రెన్షా.

WhatsApp channel

సంబంధిత కథనం