Wtc 2023 -25 - Teamindia: డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి పడిపోయిన టీమ్ ఇండియా - టాప్‌లో పాక్
Wtc 2023 -25 - Teamindia: వెస్టిండీస్‌తో సెకండ్ టెస్ట్ డ్రాతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో టీమ్ ఇండియా రెండో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.
Wtc 2023 -25 - Teamindia: డబ్యూటీసీ టైటిల్ రెండు సార్లు తుది మెట్టుపై బోల్తా పడింది. టీమ్ ఇండియా ఈ ఏడాది జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయి రెండోసారి రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకుంటుంది. డబ్యూటీసీ 2023 -25 కప్ కొట్టాలనే ఆశయంతో మళ్లీ పోరును మొదలుపెట్టింది. వెస్టిండీస్‌పై ఫస్ట్ టెస్ట్ గెలుపుతో డబ్ల్యూటీసీ 2023 -25 పాయింట్స్ టేబుల్‌లో టీమ్ ఇండియా టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది. పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది.

అయితే ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఒక గెలుపు, ఒక ఓటమితో ఇండియా రెండో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ప్రస్తుతం శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది పాకిస్థాన్. తొలి టెస్ట్‌లో విజయంతో పాకిస్థాన్ డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. పాకిస్థాన్‌కు 12 పాయింట్లు, ఇండియా 16 పాయింట్లతో ఉన్నాయి.
ఈ లిస్ట్‌లో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రాతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలవగా, ఒక గెలుపు, రెండు ఓటములు, ఒక డ్రాతో నాలుగో స్థానంలో ఉంది.
మళ్లీ డిసెంబర్ లోనే..
యాషెస్ సిరీస్‌తో డబ్ల్యూటీసీ 2023-25 షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్‌లో ప్రపంచ టెస్ట్ దేశాలు అన్ని కలిసి 68 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో ప్రతి జట్టు ఆరు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ రెండేళ్ల షెడ్యూల్‌లో టీమ్ ఇండియా 20 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. వెస్టిండీస్ సిరీస్ తర్వాత టెస్ట్‌లకు టీమ్ ఇండియా సుదీర్ఘకాలం దూరంగా ఉండనుంది. మళ్లీ డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది.