WPL 2023 Live Streaming: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లైవ్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
WPL 2023 Live Streaming: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 శనివారం నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 4 నుంచి మార్చి 26 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఐదు జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో 20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
WPL 2023 Live Streaming: ఐపీఎల్ తరహాలో మహిళలకు వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డబ్ల్యూపీఎల్ వేలం కూడా నిర్వహించారు. అందరికంటే ఎక్కువగా స్మృతి మంధానా అత్యధిక ధరను కైవసం చేసుకుంది. మార్చి 4 నుంచి మార్చి 26 వరకు ఈ టోర్నీ జరగనుంది. తొలి మ్యాచ్ మార్చి 4న ముంబయి వేదికగా ముంబయి ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ మధ్య జరగనుంది. ఈ ఆరంభ సీజన్‌కు విపరీతంగా బజ్ ఏర్పడింది. ఐదు జట్లు 20 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపింటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. ఇప్పటికే మహిళా క్రికెటర్లు తమ తమ జట్లతో చేరినట్లు తెలుస్తోంది. డబ్ల్యూపీఎల్ 2023 టికెట్లు కూడా ఆన్‌లైన్ ప్లాట్ ఫాంలో అందుబాటులో ఉన్నాయి. ముంబయిలో అయితే కేవలం రూ.100లకే టికెట్లను విక్రయిస్తున్ బీసీసీఐ బుక్ మై షోతో డబ్ల్యూపీఎల్ టికెట్లతో ఒప్పందం కుదుర్చుకున్న అతి తక్కువ ధరకే టికెట్లను అందుబాటులో తీసుకొచ్చింది.
డబ్ల్యూపీఎల్ 2023 లైవ్ స్ట్రీమింగ్..
డబ్ల్యూపీఎల్ టోర్నీని వయకామ్ 18, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికల్లో మాత్రమే లైవ్ చూడవచ్చు. ఇప్పటికే వయాకామ్ 18 నెట్వర్క్ పురుషుల ఐపీఎల్ డిజిటల్ హక్కులను ఒక్క భారత్‌లోనే రూ.23,757.5 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మూడు ఇతర ప్రాంతాల్లోనూ డిజిటల్, టీవీ హక్కులను సొంతం చేసుకుంది. భారత్‌లో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌ను లైవ్ చూడాలంటే స్పోర్ట్స్ 18 టీవీ నెట్వర్క్‌లో చూడవచ్చు. లేదా జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లలో వీక్షించవచ్చు.
డబ్ల్యూపీఎల్ 2023 మొత్తం జట్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
స్మృతీ మంధాన, సోఫీ డివైన్, ఎలిస్ పెర్రీ, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఇంద్రాణి రాయ్, దిశ కసత్, శ్రేయా పాటిల్, కానిక అహుజ, ఆషా శోభన, ఎరిన్ బర్న్స్, హెదర్ నైట్, డేన్ వ్యాన్ నీకెర్క్, ప్రీతీ బోస్, పూనమ్ ఖేమ్నర్, కోమల్ జంజాద్, మేఘన్ స్కూట్, సహానా పవార్.
ముంబయి ఇండియన్స్..
హర్మన్ ప్రీత్ కౌర్, న్యాట్ స్కైవర్-బ్రంట్, అమిలియా కెర్, పూజా వస్త్రాకర్, యస్తిక భాటియా, హెథర్ గ్రహమ్, ఐసీ రాంగ్, అమన్ జ్యోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషఖే, హేలీ మ్యాథ్యూస్, చోలీ ట్రయన్, ప్రియాంక బాల, హుమైరా కాజీ, నీలం బిష్త్, జింటామణి కలిత, సోనమ్ యాదవ్.
గుజరాత్ టైటాన్స్..
ఆష్లే గార్డెనర్, బెత్ మూనీ, సోఫియా డంక్లే, అనబెల్ సదర్‌ల్యాండ్, హల్లీన్ డియోల్, డియెండ్ర డాటిన్, స్నేహ్ రానా, ఎస్ మేఘన, జార్జియా వార్హేమ్, మానసీ జోషి, డేలన్ హేమలత, మోనిక పటేల్, తనూజ కన్వేర్, సుష్మా వర్మ, హర్లే గలా, అశ్వనీ కుమారి, పారుణిక సిసోడియా, షబ్నమ్ షకీల్.
యూపీ వారియర్స్..
సోఫీ ఎకెల్‌స్టోన్, దీప్తి శర్మ, తహిల మెక్‌గ్రాత్, షబ్నమ్ ఇస్మాయిల్, అలీసా హేలీ, అంజలి సర్వాణి, రాజేశ్వరీ గైక్వాడ్, పరష్వీ చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్ యశశ్రీ, కిరణ్ నీవగిరే, గ్రేస్ హ్యారిస్, దేవిక వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, సిమ్రన్ షేక్
దిల్లీ క్యాపిటల్స్..
జెమీమా రోడ్రిగ్స్, మెగ్ ల్యానింగ్, షెఫాలీ, రాధా యాదవ్, శిఖా పాండే, మరిజానే కప్, టైటస్ సంధు, అలైస్ క్యాప్సే, టారా నోరిస్, లారా హ్యారిస్, జైశా అక్తర్, మిన్ను మణి, పూనమ్ యాదవ్, తానియా భాటియా, జెస్ జోనాసెన్, స్నేహ్ దీప్తి, అరుందతి రెడ్డి, అపర్ణ మండల్.
టాపిక్