40 ఏళ్ల అథ్లెట్.. ఒక్క ఏడాదిలో రూ.2356 కోట్లు.. ప్రపంచంలోనే రిచెస్ట్ ప్లేయర్ ఎవరో తెలుసా? తాజా ఫోర్బ్స్ లిస్ట్ ఇదే-worldr richest sports person player cristiano ronaldo year income 275 million dollors forbs 2025 athletes list ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  40 ఏళ్ల అథ్లెట్.. ఒక్క ఏడాదిలో రూ.2356 కోట్లు.. ప్రపంచంలోనే రిచెస్ట్ ప్లేయర్ ఎవరో తెలుసా? తాజా ఫోర్బ్స్ లిస్ట్ ఇదే

40 ఏళ్ల అథ్లెట్.. ఒక్క ఏడాదిలో రూ.2356 కోట్లు.. ప్రపంచంలోనే రిచెస్ట్ ప్లేయర్ ఎవరో తెలుసా? తాజా ఫోర్బ్స్ లిస్ట్ ఇదే

ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరో తెలుసా? 40 ఏళ్ల వయసులో ఆ అథ్లెట్ ఏడాదికి రూ.2356 కోట్లు సంపాదించాడు. తాజాగా ఫోర్బ్స్ లిస్ట్ అనౌన్స్ చేసిన టాప్-5 రిచెస్ట్ ప్లేయర్ల లిస్ట్ చూస్తే షాక్ అవాల్సిందే.

ఫోర్బ్స్ రిచెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ (REUTERS)

ఫోర్బ్స్ 2025 లిస్ట్ వచ్చేసింది. దీని ప్రకారం ప్రపంచ రిచెస్ట్ ప్లేయర్ ఎవరో కాదు.. ఫుట్‌బాల్‌ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రీడాకారుడిగా రొనాల్డో నిలిచాడు. వరుసగా మూడో సారి టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. అల్ నాసర్ క్లబ్, పోర్చుగల్ జాతీయ జట్టుకు ఆడుతున్న రొనాల్డో సంపాదనలో అదరగొడుతున్నాడు. 1000 గోల్స్ రికార్డుపై కన్నేసిన రొనాల్డో ఆదాయంలోనూ హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు.

ముగ్గురు ఫుట్‌బాల్‌ ప్లేయర్లే

ఫోర్బ్స్ 2025 అత్యంత ధనిక క్రీడాకారుల జాబితాలో టాప్-5లో ముగ్గురు ఫుట్‌బాల్‌ ప్లేయర్లే. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), డాక్ ప్రిస్కాట్ (అమెరికా), లియోనల్ మెస్సి (అర్జెంటీనా) టాప్-5లో ఉన్నారు. బాస్కెట్ బాల్ ప్లేయర్ స్టీఫెన్ కర్రీ (అమెరికా), బాక్సర్ టైసన్ ఫ్యూరీ (యూకే) మిగతా ఇద్దరు.

రొనాల్డో ఆదాయం

40 ఏళ్ల రొనాల్డో ఫోర్బ్స్ ప్రపంచ సంపన్న క్రీడా తారల జాబితాలో వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచాడు. ఓవరాల్ గా పోర్చుగీస్ ఫుట్ బాల్ లెజెండ్ కు ఇది ఐదో ఏడాది కావడం విశేషం. రొనాల్డో గత ఏడాదిలో 275 మిలియన్ డాలర్లు సంపాదించాడు, ఇది సుమారు 2,356,526,010 రూపాయల (రెండు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల పదిహేను లక్షలు) కు సమానం. రూ.2356 కోట్లతో రొనాల్డో మరోసారి అదరగొట్టాడు.

సెకండ్ ప్లేస్ లో

రొనాల్డో తర్వాత గోల్డెన్ స్టేట్ వారియర్స్ గార్డ్ స్టీఫెన్ కర్రీ (అమెరికా) సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. మార్చిలో 4,000 కెరీర్ త్రీ-పాయింటర్లను చేరుకున్న మొదటి ఎన్బీఏ ప్లేయర్ గా స్టీఫెన్ రికార్డు నెలకొల్పాడు. అతను 156 మిలియన్ డాలర్లతో ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరుకున్నాడు. బాక్సర్ టైసన్ ఫ్యూరీ 146 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచాడు.

అమెరికా ఫుట్‌బాల్‌ ప్లేయర్ డాక్ ప్రిస్కాట్ (137 మిలియన్ డాలర్లు), మరో దిగ్గజ ఫుట్‌బాల్‌ ప్లేయర్ లియోనల్ మెస్సి (135 మిలియన్ డాలర్లు) వరుసగా నాలుగు, అయిదో స్థానాల్లో ఉన్నారు.

టాప్-10 ఫోర్బ్స్ సంపన్న క్రీడాకారుల జాబితా

RankNameSportNationalityTotal EarningsOn-field EarningsOf-field earnings
1Cristiano RonaldoFootballPortugal$275 M$225 M$50 M
2Stephen CurryBasketballUSA$156 M$56 M$100 M
3Tyson FuryBoxingUK$146 M$140 M$6 M
4Dak PrescottFootballUSA$137 M$127 M$10 M
5Lionel MessiFootballArgentina$135 M$60 M$75 M
6LeBron JamesBasketballUSA$133.8 M$48.8 M$85 M
7Juan SotoBaseballDominican Republic$114 M$109 M$5 M
8Karim BenzemaFootballFrance$104 M$100 M$4 M
9Shohei OhtaniBaseballJapan$102.5 M$2.5 M$100 M
10Kevin DurantBasketballUSA$101.4 M$51.4 M$50 M

ప్రకటనల ద్వారా

పోర్చుగీస్ ఫార్వర్డ్ రొనాల్డో ఆఫ్-ఫీల్డ్ ఎండార్స్ మెంట్ల ద్వారా తన ఆదాయాన్ని 15 మిలియన్ డాలర్లు పెంచుకున్నాడు. రొనాల్డో ఆదాయంలో గణనీయమైన భాగం సౌదీ అరేబియా క్లబ్ అల్-నాసర్ తో ఒప్పందం నుండి వస్తుంది. అక్కడ అతను గణనీయమైన వేతనాన్ని అందుకుంటాడు.

అతని సోషల్ మీడియా ఫాలోయింగ్ 939 మిలియన్లు అని అంచనా. అన్ని ప్లాట్ ఫామ్ లు కలిపి రొనాల్డోకు రికార్డు సంఖ్యలో ఫాలోవర్లున్నారు. నైక్, హెర్బాలైఫ్, బినాన్స్ వంటి బ్రాండ్లతో లాభదాయకమైన ఎండార్స్మెంట్ ఒప్పందాలు రొనాల్డోను రిచెస్ట్ ప్లేయర్ గా మార్చాయి.

లిస్ట్ ఇలా

మే 1, 2024 నుంచి మే 1, 2025 వరకు వచ్చిన ఆదాయాన్ని ట్రాక్ చేయడం ద్వారా ఫోర్బ్స్ 2025 జాబితాను రూపొందించింది. ఈ ప్రచురణ జీతభత్యాలు, గెలుపోటములు వంటి ఆన్-ఫీల్డ్ ఆదాయాలు.. ఎండార్స్మెంట్లు, లైసెన్సింగ్, వ్యాపార వెంచర్ల నుండి ఆఫ్-ఫీల్డ్ ఆదాయం రెండింటినీ పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుత మారకం రేటు ఆధారంగా గణాంకాలను అమెరికా డాలర్లుగా మార్చారు. ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఫోర్బ్స్ పరిశ్రమ ఇన్సైడర్లు, వార్తా నివేదికలు, స్పాట్రాక్ వంటి వేతన డేటాబేస్లను సంప్రదించింది.

2025 జాబితాలో పది మంది అథ్లెట్లు 100 మిలియన్ డాలర్ల ఆదాయ పరిమితిని అధిగమించి రికార్డు స్థాయిలో 1.38 బిలియన్ డాలర్లను సంపాదించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం