Women's Asia Cup Schedule: మహిళల ఆసియా కప్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఆ రోజే-womens asia cup schedule announced as india to take on pakistan on october 7th ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Womens Asia Cup Schedule Announced As India To Take On Pakistan On October 7th

Women's Asia Cup Schedule: మహిళల ఆసియా కప్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఆ రోజే

Hari Prasad S HT Telugu
Sep 21, 2022 03:37 PM IST

Women's Asia Cup Schedule: మహిళల ఆసియా కప్‌ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా ఇండియా, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ షెడ్యూల్‌ బుధవారం (సెప్టెంబర్‌ 21) రిలీజైంది.

ఆసియా కప్ లో భాగంగా అక్టోబర్ 7న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్
ఆసియా కప్ లో భాగంగా అక్టోబర్ 7న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ (PTI)

Women's Asia Cup Schedule: పురుషుల ఆసియా కప్‌ ఈ మధ్యే ముగిసింది. ఇందులో శ్రీలంక విజేతగా నిలిచిన విషయం తెలుసు కదా. ఇక ఇప్పుడు మహిళల ఆసియా కప్‌ జరగనుంది. ఈ టోర్నీ అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ బుధవారం (సెప్టెంబర్‌ 21) రిలీజ్‌ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

తొలి రోజే ఆతిథ్య బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌ మధ్య తొలి మ్యాచ్‌, ఆ తర్వాత ఇండియా, శ్రీలంక మధ్య మరో మ్యాచ్‌ జరగనున్నాయి. అక్టోబర్‌ 11 వరకూ లీగ్‌ స్టేజే కొనసాగనుంది. ఇక అక్టోబర్‌ 13న సెమీఫైనల్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. అక్టోబర్‌ 15న ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఇండియన్ టీమ్‌ ఆరు లీగ్‌ మ్యాచ్‌లు ఆడనుంది. మహిళల ఆసియా కప్‌లోనూ ఆరుసార్లు టైటిల్‌ గెలిచి ఇండియా సక్సెస్‌ఫుల్‌ టీమ్‌గా నిలిచింది.

షెడ్యూల్‌ ఇదే.. ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 7న..

అక్టోబర్‌ 1 - బంగ్లాదేశ్‌ vs థాయ్‌లాండ్‌ (మధ్యాహ్నం 2 గంటలకు)/ ఇండియా vs శ్రీలంక (సాయంత్రం 6.30)

అక్టోబర్‌ 2 - పాకిస్థాన్‌ vs మలేషియా (2 గంటలకు)/ శ్రీలంక vs యూఏఈ (సాయంత్రం 6.30)

అక్టోబర్‌ 3 - పాకిస్థాన్‌ vs బంగ్లాదేశ్‌ ( 2 గంటలకు) / ఇండియా vs మలేషియా (సాయంత్రం 6.30)

అక్టోబర్‌ 4- శ్రీలంక vs థాయ్‌లాండ్‌ (2 గంటలకు) / ఇండియా vs యూఏఈ (సాయంత్రం 6.30)

అక్టోబర్‌ 5 - యూఏఈ vs మలేషియా ( 2 గంటలకు)

అక్టోబర్‌ 6 - పాకిస్థాన్‌ vs థాయ్‌లాండ్‌ ( 2 గంటలకు) / బంగ్లాదేశ్‌ vs మలేషియా (సాయంత్రం 6.30)

అక్టోబర్‌ 7 - థాయ్‌లాండ్ vs యూఏఈ ( 2 గంటలకు) / ఇండియా vs పాకిస్థాన్‌ (సాయంత్రం 6.30)

అక్టోబర్‌ 8 - శ్రీలంక vs మలేషియా (2 గంటలకు)/ఇండియా vs బంగ్లాదేశ్‌ (సాయంత్రం 6.30)

అక్టోబర్‌ 9 - థాయ్‌లాండ్‌ vs మలేషియా (2 గంటలకు)/పాకిస్థాన్‌ vs యూఏఈ (సాయంత్రం 6.30)

అక్టోబర్‌ 10 - శ్రీలంక vs బంగ్లాదేశ్‌ (2 గంటలకు)/ఇండియా vs థాయ్‌లాండ్‌ (సాయంత్రం 6.30)

అక్టోబర్‌ 11 - బంగ్లాదేశ్‌ vs యూఏఈ (2 గంటలకు)/పాకిస్థాన్‌ vs శ్రీలంక (సాయంత్రం 6.30)

అక్టోబర్‌ 13 - తొలి సెమీఫైనల్‌: టీమ్‌ 1 vs టీమ్‌ 4 (2 గంటలకు)/ రెండో సెమీఫైనల్‌: టీమ్‌ 2 vs టీమ్‌ 3 (సాయంత్రం 6.30)

అక్టోబర్‌ 15 - ఫైనల్‌

ఆసియాకప్‌కు ఇండియన్‌ టీమ్‌ ఇదే

ఆసియాకప్‌ 2022లో పాల్గొనబోయే ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ను బుధవారం (సెప్టెంబర్‌ 21) ఆలిండియా వుమెన్స్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్‌కౌర్‌ కెప్టెన్‌ కాగా.. స్మృతి మంధానా వైస్‌ కెప్టెన్‌గా ఉండనుంది.

టీమ్‌ ఇదే : హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధానా, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్జ్‌, సబ్బినేని మేఘన, రిచా ఘోష్‌, స్నేహ్‌ రాణా, దయాలన్‌ హేమలత, మేఘనా సింగ్‌, రేణుకా ఠాకూర్‌, పూజా వస్త్రకర్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, రాధా యాదవ్‌, కేపీ నావ్‌గిరె

WhatsApp channel