Telugu News  /  Sports  /  Womens Asia Cup 2022 India Beat Thailand By 9 Wickets
ఆసియా కప్ లో కొనసాగుతున్న ఇండియన్ వుమెన్స్ టీమ్ విజయ పరంపర
ఆసియా కప్ లో కొనసాగుతున్న ఇండియన్ వుమెన్స్ టీమ్ విజయ పరంపర (BCCI women twitter)

Women's Asia Cup 2022: ఆరు ఓవర్లలోనే కొట్టేశారు.. థాయ్‌ను చిత్తుగా ఓడించిన ఇండియా

10 October 2022, 14:54 ISTHari Prasad S
10 October 2022, 14:54 IST

Women's Asia Cup 2022: మహిళల ఆసియాకప్‌లో ఇండియా ఖాతాలో ఐదో విజయం చేరింది. థాయ్‌లాండ్‌తో సోమవారం (అక్టోబర్‌ 10) జరిగిన మ్యాచ్‌లో కేవలం 6 ఓవర్లలోనే టార్గెట్‌ చేజ్‌ చేసి 9 వికెట్లతో గెలిచింది.

Women's Asia Cup 2022: మహిళల ఆసియా కప్‌లో ఇండియన్‌ టీమ్‌ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌లలో ఐదు విజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. సోమవారం (అక్టోబర్‌ 10) పసికూన థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింత చెలరేగిపోయింది. ప్రత్యర్థి విధించిన 38 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 6 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోయ్‌ చేజ్‌ చేయడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

షెఫాలీ వర్మ 6 బాల్స్‌లో 8 రన్స్‌ చేసి ఔట్‌ కాగా.. మిగిలిన పనిని మరో ఓపెనర్‌ మేఘన, పూజా వస్త్రకర్‌ పూర్తి చేశారు. మేఘన 18 బాల్స్‌లో 20 రన్స్‌, పూజా 12 బాల్స్‌లో 12 రన్స్‌ చేసి అజేయంగా నిలిచారు. దీంతో ఇండియన్‌ టీమ్‌ 6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 40 రన్స్‌ చేసింది.

37 పరుగులకే థాయ్ ఆలౌట్

అంతకుముందు పసికూన థాయ్‌లాండ్‌ టీమ్‌ను ఓ ఆటాడుకున్నారు ఇండియన్ బౌలర్లు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హర్మన్‌ప్రీత్‌ సేన.. 15.1 ఓవర్లలో 37 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసింది. స్పిన్నర్లు స్నేహ్‌ రాణా 3, రాజేశ్వరి గైక్వాడ్‌ 2, దీప్తి శర్మ 2 వికెట్లు తీసుకున్నారు.

థాయ్‌ టీమ్‌లో ఓపెనర్‌ నన్నపట్‌ కొంచారెంకాయ్‌ 12 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఇక మిగిలిన పది మంది సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇండియన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. కేవలం ఒకే ఒక్క ఎక్స్‌ట్రా రన్‌ ఇచ్చారు. ముఖ్యంగా స్నేహ్‌ రాణా 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం విశేషం.

రాజేశ్వరి 3 ఓవర్లలో 8 పరుగులకు 2 వికెట్లు, దీప్తి శర్మ 4 ఓవర్లలో 10 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నారు. భారత బౌలర్ల ధాటికి థాయ్‌లాండ్‌ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 13 పరుగుల దగ్గర తొలి వికెట్‌ కోల్పోయిన ఆ టీమ్‌.. ఇక అక్కడి నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. 20 పరుగుల దగ్గర రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 24 రన్స్‌ దగ్గర మరో రెండు వికెట్లు పడ్డాయి. ముగ్గురు థాయ్‌ బ్యాటర్లు డకౌటయ్యారు.