Kohli Fans At Pakistan Super League: పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో కోహ్లి ఫ్యాన్ హ‌ల్‌చ‌ల్‌-wish to see virat kohli in multan pakistan fan special request to virat at psl opening match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Wish To See Virat Kohli In Multan Pakistan Fan Special Request To Virat At Psl Opening Match

Kohli Fans At Pakistan Super League: పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో కోహ్లి ఫ్యాన్ హ‌ల్‌చ‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 15, 2023 08:23 AM IST

Kohli Fans At Pakistan Super League: పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో లాహోర్ ఖలంద‌ర్స్‌, ముల్తాన్ సుల్తాన్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌కు కోహ్లి ఫ్యాన్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు. మ్యాచ్ ద్వారా త‌న మ‌న‌సులోని కోరిక‌ను చాటిచెప్పాడు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

Kohli Fans At Pakistan Super League: విరాట్ కోహ్లి క్లాస్ బ్యాటింగ్‌కు ఇండియాలోనే కాకుండా విదేశాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. అత‌డి బ్యాటింగ్ మెరుపుల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసే అవ‌కాశం ద‌క్కాల‌ని ప్ర‌తి అభిమాని కోరుకుంటుంటాడు. పాకిస్థాన్‌కు చెందిన ఓ అభిమానికి అలాంటి కోరికే ఉంది. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ వేదిక‌గా త‌న క‌ల‌ను వ్య‌క్తం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో భాగంగా సోమ‌వారం తొలి మ్యాచ్ లాహోర్ ఖ‌లంద‌ర్స్‌, ముల్తాన్ సుల్తాన్స్ మ‌ధ్య జ‌రిగింది. ఈ మ్యాచ్ జ‌రుగుతోన్న స‌మ‌యంలో గ్యాల‌రీలో నుంచి ఓ అభిమాని కోహ్లి పేరుతో ఉన్న ప్ల‌కార్డ్ ప‌ట్టుకొని క‌నిపించ‌డం వైర‌ల్‌గా మారింది. ముల్తాన్‌లో కోహ్లి ఆడితే చూడాల‌ని ఉందంటూ ఆ ఫ్ల‌కార్డ్‌పై రాసి ఉంది. ప‌దే ప‌దే అత‌డు ఫ్ల‌కార్డ్ ప‌ట్టుకొని టీవీలో క‌నిపించాడు.

అత‌డి ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ పాకిస్థాన్ అభిమాని ఫొటోల‌ను కోహ్లి ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. త‌న ఆట‌తీరుతో పాకిస్థాన్‌ ఫ్యాన్స్ మ‌న‌సుల్ని కోహ్లి గెలుచుకున్నాడంటూ ఈ ఫొటోను ఉద్దేశించి ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు.

రెండు దేశాల మ‌ధ్య ఉన్న విభేదాల కార‌ణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయి చాలా కాల‌మైంది. 2023లో పాకిస్థాన్‌లో జ‌రుగ‌నున్న ఆసియా క‌ప్‌లో భార‌త్ పాల్గొన‌డం అనుమానంగా మారిపోయింది. దాంతో వేదిక‌ను మార్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఒక‌వేళ భార‌త్ ఆసియా క‌ప్ ఆడ‌క‌పోతే తాము వ‌ర‌ల్డ్ క‌ప్‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చెబుతోంది. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఈ ఏడాది ఇండియాలోనే జ‌రుగ‌నుంది.

WhatsApp channel