Jadeja Vs Ruturaj : బీసీసీఐ నిర్ణయంతో జడేజాకు ఇబ్బంది.. రుతురాజ్ లక్కీబాయ్.. సీఎస్‌కే కెప్టెన్ ఎవరు?-who will be the next csk captain ravindra jadeja or ruturaj gaikwad ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Who Will Be The Next Csk Captain Ravindra Jadeja Or Ruturaj Gaikwad

Jadeja Vs Ruturaj : బీసీసీఐ నిర్ణయంతో జడేజాకు ఇబ్బంది.. రుతురాజ్ లక్కీబాయ్.. సీఎస్‌కే కెప్టెన్ ఎవరు?

Anand Sai HT Telugu
Jul 18, 2023 07:52 AM IST

Ruturaj Vs Jadeja : ఇటీవల ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. భారత జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ని నియమించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి ఓ చర్చ మెుదలైంది.

జడేజా వర్సెస్ రుతురాజ్
జడేజా వర్సెస్ రుతురాజ్ (Twitter)

ఎప్పుడు ఎవరికి ఎలా అదృష్టం వరిస్తుందో చెప్పలేం. అనుకునేది ఒక్కటి జరిగేది ఒక్కటి ఉంటుంది. ఇక క్రికెట్ ప్రపంచంలోనూ అంతే ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుందో ఊహించలేం. కచ్చితంగా ఆడతాడు అనుకున్నవాళ్లు, ఆడలేరు. కొన్నిసార్లు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. దుమ్మురేపేవారూ ఉంటారు. కెప్టెన్సీ విషయంలోనూ అంతే. ఐపీఎల్ లో ఎప్పుడు ఎవరికి కెప్టెన్సీ వరిస్తుందో కూడా చెప్పడం కష్టం. ఇప్పుడు బీసీసీఐ నిర్ణయం తీసుకున్న నిర్ణయంతో రుతురాజ్ కు కాస్త కలిసి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

భారత జట్టు తరఫున కేవలం 10 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్‌ను భారత జట్టు కెప్టెన్‌గా నియమించడం ఆశ్చర్యం కలిగించింది. భారత జట్టు తదుపరి కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, శుబ్‌మాన్ గిల్‌ల పేర్లు వినిపిస్తుండగా, వారందరి కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్‌ భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. అది ఎలా అంటే.. ఆసియా గేమ్స్ కు రుతురాజ్ కెప్టెన్ బాధ్యతలు చూసుకుంటున్నాడు.

అలాగే రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించడం ద్వారా చెన్నై జట్టులో గందరగోళం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధోని తర్వాత ఐపీఎల్ సిరీస్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా జడేజాను మళ్లీ ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత సీజన్‌లో వేడుకల్లో జడేజాను ఎత్తుకుని ధోనీ ఈ విషయాన్ని పరోక్షంగా ప్రకటించడం కనిపించింది. దీంతో నెక్ట్స్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ జడేజాను చాలా మంది అభిప్రాయపడ్డారు.

అయితే రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధిస్తే.. చెన్నై జట్టు తదుపరి కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అంతే కాకుండా క్రికెట్ జీవితంలో పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేని జడేజా.. తొలిసారి సీఎస్ కే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాక వరుస పరాజయాలను చవిచూశాడు.

అయితే రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర, పూణె, స్థానిక టీ20 జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దాదాపు ధోనీ లాగే బ్యాటింగ్, ఫీల్డింగ్ కూడా పెద్దగా టెన్షన్ లేకుండా చేస్తున్నాడు. అదేవిధంగా వివాదాల్లో చిక్కుకోని ఆటగాడి పేరు కూడా రుతురాజ్ సొంతం.

కేవలం 26 ఏళ్ల వయస్సు ఉన్న రుతురాజ్ గైక్వాడ్ CSK జట్టుకు కాబోయే కెప్టెన్‌గా కనిపిస్తాడా అని కొందరు మాట్లాడుకుంటున్నారు. బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో జడేజా, రుతురాజ్ గైక్వాడ్ మధ్య చెన్నై జట్టుకు కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారోనన్న అయోమయం అభిమానుల్లో నెలకొంది. సీనియర్ ఆటగాడు అయిన జడేజాకే అవకాశం ఇస్తారా? ఒకవేళ ఆసియా గేమ్స్ లో రుతురాజ్ గెలిచి వస్తే.. ఛాన్స్ ఇస్తారా? చూడాలి ఏం జరుగుతుందో..

WhatsApp channel