Maaya Rajeshwaran: ట్రెండ్ అవుతున్న నయా టెన్నిస్ స్టార్.. నాదల్ అకాడమీలో ట్రెయినింగ్.. ఎవరీ 15 ఏళ్ల మాయా రాజేశ్వరన్
Maaya Rajeshwaran: 15 ఏళ్ల మాయా రాజేశ్వరణ్ రేవతి భారత టెన్నిస్ సంచలనంగా మారింది. డబ్ల్యూటీఏ పాయింట్ సాధించిన అతిపిన్న వయస్సు భారత టెన్నిస్ ప్లేయర్ గా రికార్డు నమోదు చేసింది.

టెన్నిస్ సెన్సేషన్
టెన్నిస్ లో సెన్సేషనల్ ప్రదర్శనతో మాయా రాజేశ్వరన్ దూసుకెళ్తోంది. సింగిల్స్ లో సూపర్ ఫామ్ తో భారత టాప్ సింగిల్స్ ప్లేయర్ గా ఎదిగేలా కనిపిస్తోంది. 15 ఏళ్లకే వయసుకు మించిన ఆటతీరుతో అదరగొడుతోంది. నిలకడగా రాణిస్తోంది. డబ్ల్యూటీఏ పాయింట్ ఖాతాలో వేసుకుంది.
డబ్ల్యూటీఏ పాయింట్
ఎల్ అండ్ టీ ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ 125 సిరీస్‌లో యువ టెన్నిస్ ప్లేయర్ మాయా అసాధారణ ప్రదర్శనతో సెమీస్ లో చోటు దక్కించుకుంది. ఈ క్రమంలో ఇటలీకి చెందిన 264వ ప్రపంచ ర్యాంకర్ నికోల్ ఫోస్సా హ్యూర్గోపై 6–3, 3–6, 6–0తో గెలిచింది. ఆ తర్వాత ప్రపంచ 434వ ర్యాంకర్ జెస్సికా ఫైలా (అమెరికా)ను 7–6(9), 1–6, 6–4 తో చిత్తుచేసింది. ఈ అద్భుత విజయాలతో డబ్ల్యూటీఏ పాయింట్ సాధించిన యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్ గా నిలిచింది.
వైల్డ్ కార్డుతో ఎంట్రీ
ఈ డబ్ల్యూటీఏ 125 ఈవెంట్‌లో వైల్డ్ కార్డుతో ఎంట్రీ అయిన మాయా సూపర్ పర్ ఫార్మెన్స్ తో సత్తాచాటుతోంది. ఆమె ప్లేయింగ్ స్టైల్ దిగ్గజం సెరెనా విలియమ్స్, సబలెంకాను పోలి ఉంది. తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన మాయా చిన్నతనంలో ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్ లో భాగంగా టెన్నిస్ ఎంచుకుంది. ఆ తర్వాత అదే ఆమెకు ప్రాణంగా మారింది.
నాదల్ అకాడమీలో
మొదట భారత మాజీ నంబర్ వన్ కె.జి.రమేష్ దగ్గర శిక్షణ పొందిన మాయా.. ఆ తర్వాత ఐదు సంవత్సరాలు కోచ్ మనోజ్ కుమార్ ట్రెయినింగ్ లో మెరుగైంది. మెల్లార్కాలోని రాఫెల్ నాదల్ అకాడమీలో ఒక వారం శిక్షణ ఇప్పటివరకూ ఆమె కెరీర్ లో కీలక మలుపు. తన నైపుణ్యాల కారణంగా ఈ అకాడమీలో ఒక ఏడాది పాటు శిక్షణ పొందే అవకాశం ఆమెకు దక్కింది.
టాపిక్