ఐపీఎల్ 2022 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. లీగ్ మ్యాచ్‌లన్నీ ముగియడంతో వేదిక మహారాష్ట్ర నుంచి కోల్‌కతాకు మారింది. మంగళవారం నాడు గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌కు ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. అయితే ఇక్కడ వర్షం పడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వాతావరణ్ శాఖ నివేదిక ప్రకారం కోల్‌కతాలో వర్షం పడే అవకాశం 70 శాతంగా ఉంది. దీంతో మ్యాచ్ నిర్వహణపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ పరిస్థితి ఏంటి? ఏయే నిబంధనలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.,వర్షం వస్తే పరిస్థితి ఏంటి?వాతావరణ పరిస్థితులు కారణంగా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా విజయాన్ని నిర్దేశిస్తారు. ఈ నిబంధన ప్లేఆఫ్స్, ఫైనల్ రెండు మ్యాచ్‌లకు వర్తిస్తుంది.,ఒకవేళ మైదానం చిత్తడిగా మారి సూపర్ ఓవర్ కూడా నిర్వహించడం సాధ్య పడకపోతే లీగు మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలు ఎవరైతే సాధించారో వారిని విన్నర్‌గా నిర్ణయించి ఫైనల్‌కు పంపుతారు. ఈ నిబంధన ప్లేఆఫ్ మ్యాచ్‌లైన క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2లకు వర్తిస్తుంది. వీటికి రిజర్వ్ డే ఉండదు.,అదే ఫైనల్ మ్యాచ్‌లో ఇలాంటి వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ నిర్వహణ కుదరకపోతే రిజర్వ్ డే ఉంటుంది. మే 29న ఫైనల్ జరగకపోతే.. మే 30వ తేదీని రిజర్వ్ డేగా నిర్ణయించారు. ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో వీలైవంత వరకు మ్యాచ్ నిర్వహించేందుకే ప్రయత్నిస్తారు. ఓవర్లు కుదించైనా లేదా చెరో ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు.,డీఎల్ఎస్ పద్ధతిని ఉపయోగిస్తారా?వర్షం కారణంగా కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే సాధ్యమై.. రెండో ఇన్నింగ్స్ కుదరకపోతే తుది ఫలితం కోసం డక్‌వర్త్ లూయిస్ విధానాన్ని అవలంభిస్తారు.,రిజర్వ్ డే పరిస్థితులు ఎలా ఉంటాయి..మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఆ రోజు మ్యాచ్‌లో కనీసం ఒక్క బంతి వేసినా.. అక్కడ నుంచి రిజర్వ్ డే ప్రారంభమవుతుంది. సందేహం రాకుండా ఉండేదుకు ఏదైనా మ్యాచ్ రీకాలిక్యూలేషన్ చేసినట్లయితే మునపటి రోజు జరిగిన మ్యాచ్‌ను విస్మరిస్తారు.,ఇదిలా ఉంటే టాస్ తర్వాత కూడా రిజర్వ్ డేలో ఆట సాధ్యం కాకపోతే.. రిజర్వ్ రోజున ఆట నిర్వహిస్తారు. మ్యాచ్ నిర్వహణ సమయం కూడా 5 గంటల 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇందులో వాతావరణ కారణంగా జోడించిన అదనపు సమయం కూడా ఉంది.,ఫైనల్ కోసం సూపర్ ఓవర్ అర్ధరాత్రి 1.20 గంటలకు ప్రారంభం కావాలి. రిజర్వ్ రోజున అదనపు సమయం ముగిసే లోపు ఐదు ఓవర్ల మ్యాచ్‌ను షెడ్యూల్ చేయడం సాధ్యం కానట్లయితే షరతులకు అనుగుణంగా విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ ఆడిస్తారు. ఇందుకు పిచ్, మైదానం సిద్ధంగా ఉండాలి. ఫలితంగా సూపర్ తెల్లవారుజామున 01.20 గంటలకు ప్రారంభించవచ్చు., ,