West Indies team for T20 World Cup: రసెల్‌కు దక్కని చోటు.. టీ20 వరల్డ్‌కప్‌కు విండీస్‌ టీమ్‌ ఇదే-west indies team for t20 world cup announced as andre russel left out ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  West Indies Team For T20 World Cup Announced As Andre Russel Left Out

West Indies team for T20 World Cup: రసెల్‌కు దక్కని చోటు.. టీ20 వరల్డ్‌కప్‌కు విండీస్‌ టీమ్‌ ఇదే

Hari Prasad S HT Telugu
Sep 14, 2022 10:17 PM IST

West Indies team for T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్‌ టీమ్‌ను ఎంపిక చేశారు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌కు ఈ టీమ్‌లో చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

వెస్టిండీస్ క్రికెట్ టీమ్
వెస్టిండీస్ క్రికెట్ టీమ్ (AFP)

West Indies team for T20 World Cup: అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌కప్‌ కోసం బుధవారం (సెప్టెంబర్‌ 14) వెస్టిండీస్‌ టీమ్‌ను ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ టీమ్‌లో స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. నికొలస్‌ పూరన్‌ కెప్టెన్సీలో ఈసారి వరల్డ్‌కప్‌ బరిలో వెస్టిండీస్‌ దిగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

గతేడాది వరల్డ్‌కప్‌లో టీమ్‌లో ఉన్న రసెల్‌కు ఈసారి చోటు దక్కలేదు. ఇప్పటికే కీరన్‌ పొలార్డ్‌, డ్వేన్‌ బ్రేవోలాంటి ప్లేయర్స్ రిటైరయ్యారు. అటు సునీల్‌ నరైన్‌ కూడా టీమ్‌తోపాటు వెళ్లడం లేదు. దీంతో రెండుసార్లు ఛాంపియన్‌ అయిన విండీస్‌.. ఈసారి వరల్డ్‌కప్‌కు యంగ్‌ టీమ్‌తో వెళ్తోంది. రోవ్‌మన్‌ పావెల్‌ను టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా నియమించారు.

గతేడాది వరల్డ్‌కప్‌లో ఆడిన ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ మళ్లీ ఈ వరల్డ్‌కప్‌కు టీమ్‌లోకి తిరిగి రావడం విశేషం. ఇక ఈ టీమ్‌లో ఇప్పటి వరకూ విండీస్‌కు ఆడని ఇద్దరు యువ ఆటగాళ్లకు చోటు దక్కింది. లెగ్‌ స్పిన్నర్‌ యానిక్‌ కరియా, ఆల్‌రౌండర్‌ రేమాన్‌ రీఫర్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు. జేసన్‌ హోల్డర్‌ రూపంలో ఓ సీనియర్‌ ప్లేయర్‌ ఉండగా.. ఒడియన్‌ స్మిత్‌కి కూడా టీమ్‌లో చోటు దక్కింది.

ఇక షెల్డన్‌ కాట్రెల్‌, అల్జారీ జోసెఫ్‌, ఒబెడ్‌ మెక్‌కాయ్‌లతో విండీస్‌ పేస్‌ బౌలింగ్‌ పదునుగానే ఉంది. అకీల్‌ హొసేన్‌, కరియాలు స్పిన్నర్లుగా ఉండనున్నారు. 2012, 2016లలో రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన వెస్టిండీస్‌.. గతేడాది సూపర్‌ 12 స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఈసారి వెస్టిండీస్‌ టీమ్‌ నేరుగా సూపర్‌ 12 స్టేజ్‌కు క్వాలిఫై కాలేకపోయింది.

దీంతో అంతకుముందు జరిగే రౌండ్‌ 1లో ఆడి సూపర్ 12 కోసం అర్హత సాధించాల్సి ఉంటుంది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు అక్టోబర్‌ 5, 7 తేదీల్లో ఆస్ట్రేలియాతోనే రెండు టీ20ల సిరీస్‌ కూడా విండీస్‌ ఆడబోతోంది. ఆ తర్వాత రెండు వామప్‌ మ్యాచ్‌లలో తలపడనుండగా.. అక్టోబర్‌ 16 నుంచి వరల్డ్‌కప్‌ రౌండ్‌ 1 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

టీ20 వరల్డ్‌కప్‌కు విండీస్‌ టీమ్‌

నికొలస్‌ పూరన్‌ (కెప్టెన్‌), రోవ్‌మన్‌ పావెల్‌ (వైస్‌ కెప్టెన్‌), యానిక్‌ కరియా, జాన్సన్‌ చార్లెస్‌, షెల్డర్‌ కాట్రెల్‌, షిమ్రాన్‌ హెట్‌మయర్‌, జేసన్‌ హోల్డర్‌, అకీల్‌ హొసేన్‌, అల్జారీ జోసెఫ్‌, బ్రాండన్‌ కింగ్‌, ఎవిన్‌ లూయిస్‌, కైల్ మేయర్స్‌, ఒబెడ్‌ మెక్‌కాయ్‌, రేమన్‌ రీఫర్‌, ఒడియన్‌ స్మిత్‌

WhatsApp channel