Telugu News  /  Sports  /  Washington Sundar Half Ton Helps Team India 219 Runs Against New Zealand In 3rd Odi
వాషింగ్టన్ సుందర్
వాషింగ్టన్ సుందర్ (AFP)

India vs New Zealand 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి తేలిపోయిన భారత బ్యాటర్లు.. సుందర్ ఒంటరి పోరాటం

30 November 2022, 11:11 ISTMaragani Govardhan
30 November 2022, 11:11 IST

India vs New Zealand 3rd ODI: క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ 219 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లు విఫలమైన వేళ.. కివీస్ బౌలర్లు మెన్ ఇన్ బ్లూను ఓ మోస్తరు స్కోరుకే నిలువరించారు.

India vs New Zealand 3rd ODI: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నిర్ణీత 47.3 ఓవర్లలో భారత్ 219 పరుగులకు ఆలౌటైంది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌లపై టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. వాషింగ్టన్ సుందర్(51) అర్ధశతకం, శ్రేయాస్ అయ్యర్ 49 పరుగులు మినహా మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. ఆరంభం నుంచి టీమిండియా ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. మరోపక్క కివీస్ బౌలర్లలో ఆడం మిల్నే, డారిల్ మిచెల్ చెరో 3 వికెట్లతో అదరగొట్టగా.. టిమ్ సౌథీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. ప్రారంభం నుంచి ఓపెనర్లు నిదానంగా ఆడటంతో 9 ఓవర్లకు 39 పరుగులే చేయగలిగింది. ఆ సమయలో శుబ్‌మన్ గిల్‌ను(13) ఔట్ చేసి భారత్‌కు షాకిచ్చాడు. ఆ కాసేపటికే శిఖర్ ధావన్‌ను(28) కూడా బౌల్డ్ చేయడంతో భారత పతనం ప్రారంభమైంది. అనంతరం రిషబ్ పంత్(10) కూడా డారిల్ మిచెల్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(6) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలుచోలేకపోయాడు. ఆడం మిల్నే బౌలింగ్‌లో సౌధీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఓ పక్క శ్రేయాస్ అయ్యర్(49) బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును కాస్త ముందుకు నడిపించాడు. అతడు ఉన్నంత సేపు స్కోరు ఫర్వాలేదనిపించింది. అయితే సూర్యకుమార్ ఔటైన తర్వాత అతడు లోకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో భారత్ కష్టాలు మొదలయ్యాయి. 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో నిలిచింది. బ్యాటర్లంతా ఔట్ కావడంతో ఓ దశలో 150 పరుగులైనా చేస్తుందా అనే సందేహం వచ్చింది.

వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం..

ఇలాంటి సమయంలో వాషింగ్టన్ సుందర్(51) ఒంటరి పోరాటం చేశాడు. టెయిలెండర్ల సహాయంతో మరో 97 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నప్పటికీ.. సుందర్ ఏ మాత్రం అవకాశమివ్వలేదు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు వేగాన్ని పెంచాడు. టెయిలెండర్లు అండతో టీమిండియాకు ఓ మోస్తరు స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అర్ధసెంచరీ నమోదు చేశాడు. సిక్సర్‌తో పరుగులు పూర్తి చేశాడు. 64 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. మొత్తానికి 47.3 ఓవర్లలో 210 పరుగులకు టీమిండియా ఆలౌటైంది.