Kohli Buys Luxury Villa: లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన కోహ్లీ.. ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు?-virat kolhi buys luxury villa in mumbai alibaug for 6 crore ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kolhi Buys Luxury Villa In Mumbai Alibaug For 6 Crore

Kohli Buys Luxury Villa: లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన కోహ్లీ.. ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు?

Maragani Govardhan HT Telugu
Feb 24, 2023 04:04 PM IST

Kohli Buys Luxury Villa: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ముంబయికి సమీపంలో అలీబాగ్ ప్రాంతంలో ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారు. 2 వేల చదరపు అడుగుల వైశాల్యం కలిగిన ఈ విల్లాను రూ.6 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (PTI)

Kohli Buys Luxury Villa: టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడా? అంటే అవుననే అంటున్నాయి బీటౌన్ వర్గాలు. కోహ్లీ ముంబయిలోని ఆలీ బాగ్ ప్రాంతంలో ఓ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆవాస్ గ్రామ పరిథిలోని 2 వేల చదరపు అడుగులు వైశాల్యం కలిగిన ఈ విల్లా ఖరీదు దాదాపు రూ.6 కోట్లు ఉంటుందని అంచనా. సహజ సుందరంగా ఉండే ఈ గ్రామం మాండ్వా జెట్టీ నుంచి 5 నిమిషాల వ్యవధిలో ఉంది. అంతేకాకుండా స్పీట్ బోట్ ద్వారా ముంబయికి 15 నిమిషాల్లో చేరుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో సిరీస్‌తో విరాట్ కోహ్లీ బిజీగా ఉండటంతో అతడి సోదరుడు వికాస్ కోహ్లీ అలీబాగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఫార్మాలటీస్ పూర్తి చేశారు. ఇందుకో కోహ్లీ రూ.36 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించారు. రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్ ప్రకారం ఒప్పందంలో భాగంగా 400 చదరపు అడుగు స్విమ్మింగ్ పూల్‌ కూడా ఉంది. అలీ బాగ్ పరిసరస ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో 3 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నప్పుటు పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల విలాసవంతమైన విల్లాలు, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్‌లతో దశలవారీగా 250 ఎకరాల అభివృద్ధి జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అలీబాగ్‌లో కోహ్లీ కొనుగోలు చేసిన రెండో ప్రాపర్టీ ఇది. గతేడాది సెప్టెంబరు 1న విరాట్ తన భార్య అనుష్క శర్మ కలిసి జీరాద్ గ్రామంలో రూ.19.24 కోట్లకు 36,059 అడుగుల ఫామ్ హౌస్‌ను కొనుగోలు చేశారు. ఈ ప్రాపర్టీ కోసం కోహ్లీ రూ.1.15 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించారు. విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 2021లో అలీ బాగ్‌లోని మాత్రోలి గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.

ముంబయి పరిసర ప్రాంతాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందున్నవాటిల్లో అలీ బాగ్ ముందు వరుసలో ఉంది. అక్కడ చదరపు అడుగు రూ.3 వేల నుంచి 3,500 వరకు ధర పలుకుతుంది. వీకెండ్ డెస్టినేషన్‌కు పర్ఫెక్ట్‌గా సూటవుతున్న ఈ ప్రాంతంలో ముంబయి నుంచి ఫెర్రీ సేవలు అధికంగా సాగుతున్నాయి. త్వరలో కమర్షియల్ హబ్‌గా మారే అవకాశముంది. అంతేకాకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్‌గా ప్రతిపాదించడం ఇక్కడ లోకల్ రియల్ ఎస్టేటుకు అభివృద్ధికి ఊతమిస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్